Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోండా సీబీ300ఎఫ్ ప్లెక్స్ ఫ్యూయల్ బైక్ ఆవిష్కరణ

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (10:52 IST)
దేశంలోనే తొలిసారి ప్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ను హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ ఆవిష్కరించింది. హోండా సీబీ300ఎఫ్ పేరిట దీన్ని దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త హోండా ప్లెక్స్ ఫ్యూయల్ బైక్ బుకింగ్స్ కూడా ఇప్పటికే మార్కెట్‌లో ప్రారంభమైన విషయం తెల్సిందే. అక్టోబరు చివరి నుంచి హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లో ఈ బైక్స్‌ను అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే, ప్లెక్సీ ఫ్యూయల్ బైక్ అంటే ఏమిటి.. వీటి ధరలు, ఫీచర్లను ఓసారి తెలుసుకుందాం.
 
హోండా సీబీ300ఎఫ్ ప్లెక్స్ ఫ్యూయల్ ఫీచర్లను పరిశీలిస్తే, ఇంజిన్ 293.52 సీసీ, టార్క్ 25.6 ఎన్ఎఁ, కెర్బ్ వెయిట్ 153 కేజీలు, పవర్ 24.4 పీఎస్, మైలేజ్ 30 కిలోమీటర్ పర్ అవర్, డబుల్ డిస్క్ బ్రేకులు వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగివుంది. 
 
హోండా సీబీ300ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కొత్త బైక్​ను 293.52సీసీ, 4 స్ట్రోక్‌, సింగిల్‌ సిలిండర్‌ పీజీఎం-ఎఫ్‌ఐ ఇంజిన్‌తో తీసుకొచ్చారు. ఇది 18.3 kW పవర్​, 25.9 టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 6- స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, అసిస్టెంట్‌ స్లిప్‌ క్లచ్‌తో వస్తోంది. రెండు డిస్క్‌బ్రేక్‌లు, డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌తో దీన్ని తీసుకొచ్చారు. ఈ కొత్త హోండా సీబీ300ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్​సైకిల్​ ప్రారంభ ధర 1.70 లక్షలు (ఎక్స్- షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది.
 
ఒకటి కంటే ఎక్కువ ఇంధన మిశ్రమాలను ఫ్లెక్స్‌ ఫ్యూయల్​గా పిలుస్తారు. సాధారణంగా ఈ రకం మోటార్​సైకిల్స్ పెట్రోల్‌ + ఇథనాల్‌ లేదా మిథనాల్‌తో నడుస్తాయి. ఈ రకం బైక్​ను తీసుకురావడంపై కంపెనీ ఎండీ, సీఈఓ సుత్సుము ఒటాని హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ ప్రయాణంలో సరికొత్త మైలురాయి అని అన్నారు. ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా హోండా మోటార్​సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ బైక్​ను అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

కె.సీఆర్ స్పూర్తితో కేశవ చంద్ర రమావత్ సినిమా : హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments