Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జనరేషన్ హోండా యాక్టివా 6జీ రాబోతోంది.. ఫీచర్స్ ఏంటంటే?

Webdunia
గురువారం, 16 మే 2019 (16:14 IST)
ఆటోమొబైల్ రంగంలో వాహన తయారీ కంపెనీలు కొత్త జనరేషన్‌ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లోకి సరికొత్త బైక్‌లను తీసుకు వస్తుంటాయి. తాజాగా ప్రముఖ వాహన తయారీదారు కంపెనీ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ (హెచ్ఎంఎస్ఐ) మరో కొత్త స్కూటర్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.


దీని పేరు యాక్టివా 6జీ. హోండా కంపెనీ ఈ మోడల్‌ను 2020లో జరగనున్న ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచనుంది.హోండా యాక్టివా 6జీలో 110 సీసీ ఇంజన్ ఉంటుంది. 
 
బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్, కాల్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. 
 
ఇలాంటి అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్‌లోకి రానున్న హోండా బైక్ ఇదేనంటూ నిపుణులు చెబుతున్నారు. ఇంకా 12 అంగుళాల అలాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. అలాగే ఇందులో ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండే అవకాశాలు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
 
అస్తవ్యస్థంగా ఉన్న రోడ్లలో ప్రయాణం సుఖవంతంగా సాగే వీలుగా స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ అమర్చవచ్చు. ఇక ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న మోడల్‌లో పోలిస్తే కొత్త యాక్టివా 6జీ రూ.7,000 ఎక్కువే ఉంటుందని సమాచారం. ప్రస్తుత యాక్టివా 5జీ బేస్ మోడల్ ధర రూ.54,632గా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments