Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ఉత్తేజకరమైన టీవీ మోడల్స్- U7K, U6K, E7Kతో హైసెన్స్ ఇండియా

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (21:49 IST)
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలలో అంతర్జాతీయంగా అగ్రగామి అయిన హైసెన్స్ ఇండియా, భారతదేశంలో తమ తాజా టెలివిజన్ మోడల్స్, U7K, U6K మరియు E7Kలను ఆవిష్కరించింది. ఈ అధునాతన స్మార్ట్ టీవీలు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు భారతదేశం అంతటా క్రోమా మరియు రిలయన్స్ డిజిటల్ వంటి ప్రధాన రిటైల్ స్టోర్‌లలో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి.
 
ఈ టెలివిజన్‌లు, ప్రతి ఒక్కటి ప్రత్యేక లక్షణాలు మరియు సామర్థ్యాలతో విభిన్నంగా ఉండటంతో పాటుగా  సాటిలేని  వీక్షణ అనుభవాలను అందించడంలో హైసెన్స్ యొక్క దృఢమైన అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తాయి. మినీ LED ప్రకాశం, బిలియన్-ప్లస్ వైబ్రెంట్ కలర్ ప్యాలెట్‌లు మరియు తెలివైన AI విస్తరణలు వంటి అసాధారణ లక్షణాలతో, ఈ టెలివిజన్‌లు మనం కంటెంట్‌ని ఆస్వాదించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి.
 
పరిమిత కాల ఆఫర్ కోసం, అక్టోబర్ 1, నవంబర్ 15 మధ్య హైసెన్స్ నుండి కొత్తగా విడుదల చేయబడిన టీవీ మోడల్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లు ప్రామాణిక 2 సంవత్సరాల వారంటీతో పాటు అదనంగా ఒక సంవత్సరం వారంటీని అందుకుంటారు. అంతేకాకుండా, హైసెన్స్ ఈ సాంకేతిక పురోగతిని వినియోగదారులకు అత్యంత ఆకర్షణీయమైన ధరల వద్ద అందిస్తుంది, U7K మోడల్ కేవలం INR 59,999/-, U6K ఆకర్షణీయమైన INR 26,990/- మరియు E7K మనోహరమైన INR 24,999/-.కు లభిస్తుంది. 
 
హైసెన్స్ ఇండియా సీఈఓ  శ్రీ ప్రణబ్ మొహంతి మాట్లాడుతూ, "మా సరికొత్త టెలివిజన్ శ్రేణిని భారతదేశంలో పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ టీవీలు మా కస్టమర్‌లకు అత్యాధునిక సాంకేతికతను మరియు ఉత్తమ వీక్షణ అనుభవాలను అందించడంలో మా తిరుగులేని నిబద్ధతను సూచిస్తాయి. మినీ LED, క్వాంటం డాట్ కలర్ మరియు ఇంటెలిజెంట్ AI మెరుగుదల వంటి ఫీచర్లతో, ఈ టీవీలు భారతీయ గృహాలలో వినోదాన్ని పునర్నిర్వచించగలవని మేము విశ్వసిస్తున్నాము.  సరికొత్త ఆవిష్కరణలను  సరసమైన ధరలలో  తీసుకురావడానికి హైసెన్స్ అంకితం చేయబడింది.  భారతీయ మార్కెట్‌  పట్ల మా వాగ్దానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ , మరింత ఉత్తేజకరమైన ప్రకటనలను సంస్థ ప్రణాళిక చేసింది " అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments