Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న జీఎస్టీ వసూళ్లు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (14:15 IST)
దేశంలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. జూలై నెలకు గాను 1.49 లక్షల కోట్ల రూపాయలు వసూలు వసూలయ్యాయి. గత యేడాదితో పోల్చి చూస్తే ఇపుడు ఏకంగా 28 శాతం వృద్ధి కనిపిస్తుంది. గత 2021లో ఎస్టీ వసూళ్లు రూ.1.16 లక్షల కోట్లుగా కేంద్రం తెలిపింది. 
 
గత జూలై నెలలో ఒక్కసారిగా జీఎస్టీ వసూళ్లు పెరగడానికి ప్రధాన కారణం ఆర్థిక రికవరీ, పన్ను ఎగవేతలకు పాల్పడటమేనని పేర్కొంది. ముఖ్యంగా, దేశంలో జీఎస్టీ చట్టం గత 2007లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన నెలగా 2022 జూలై నెల సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో సాధించిన రూ.1.68 లక్షల కోట్లే జీఎస్టీ వసూళ్లలో అత్యధికం. తాజా వసూళ్లలో సీజీఎస్టీ ద్వారా రూ.25,751 కోట్లు, ఎస్‌జీఎస్టీ ద్వారా రూ.32.807 కోట్లు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఐజీఎస్టీ కింద రూ.79,518 కోట్లు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. సెస్సుల రూపంలో మరో రూ.10,920 కోట్లు సమకూరినట్లు కేంద్రం వెల్లడించింది. 
 
ఇక రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం జీఎస్టీ వసూళ్లు పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. గతేడాది జులై తెలంగాణ రూ.3610 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు సాధించగా.. ఈ సారి 26 శాతం వృద్ధితో రూ.4,547కోట్లు సాధించినట్లు కేంద్రం తెలిపింది. ఏపీలో సైతం జీఎస్టీ వసూళ్లలో 25 శాతం వృద్ధి కనిపించింది. గతేడాది రూ.2,730 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలవ్వగా.. ఈ సారి రూ.3,409 కోట్లు వసూలు అయినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments