Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్లలో విక్రయించే ఆహార పదార్థాలపై జీఎస్టీ 5 శాతం తగ్గింపు : నిర్మలా సీతారామన్

Webdunia
బుధవారం, 12 జులై 2023 (09:58 IST)
థియేటర్లలో విక్రయించి తినుబండరాలపై ఉన్న జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. అలాగే, అరుదైన వ్యాధులతో బాధడే రోగులు దిగుమతి చేసుకునే ఆహారంపై కూడా జీఎస్టీ పన్నును మినహాయించారు. ఇకపోతే క్యాసినో, గుర్రపు పందేలు వంటి బెట్టింగులపై 28 శాతం మేరకు జీఎస్టీని వసూలు విధించారు. 
 
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలు వంటి బెట్టింగులపై 28 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలని నిర్మల మీడియా సమావేశంలో వెల్లడించారు.
 
బెట్టింగులపై మంత్రుల బృందం సిఫార్సులకు అనుగుణంగా జీఎస్టీ రేటును నిర్ణయించినట్లు చెప్పారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై తొలుత ముఖ విలువపై పన్ను వేయాలా? గేమింగ్ ఆదాయంపై పన్ను వేయాలా? ప్లాట్ ఫామ్ ఫీజు మీద మాత్రమే వేయాలా? అనే అంశంపై మంత్రుల బృందం చర్చించిందని, చివరకు మొత్తం విలువ మీద పన్ను విధించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 
 
నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినా, డబ్బులతో ఆడే ఆట అయినా ఆన్‌లైన్ గేమ్‌లకు 28 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. మరోవైపు, కేన్సర్ మెడిసిన్ దినుటక్సిమాబ్, ఇతర అరుదైన వ్యాధులతో బాధపడే రోగులు దిగుమతి చేసుకునే ఆహారంపై జీఎస్టీ మినహాయంపు ఇచ్చింది. ప్రైవేటు కంపెనీల ఉపగ్రహ ప్రయోగ సేవలకు జీఎస్టీ మినహాయింపు ఉంటుందన్నారు. సినిమా థియేటర్లలో విక్రయించే ఆహార పదార్థాలు, పానీయాలపై పన్నును 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments