మే నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ పన్నుల వసూళ్లు

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (17:25 IST)
గత నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. గత కొన్ని నెలలుగా ఈ పన్నులు భారీగా వసూలవుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో మే నెలలో ఏకంగా రూ.1,57,090 కోట్లుగా వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. గత యేడాది మే నెలతో పోలిస్తే ఇపుడు ఏకంగా 12 శాతం మేరకు పెరిగినట్టు తెలిపింది. గత యేడాది రూ.1,40,885 కోట్లుగా ఉంది. 
 
మొత్తం జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.28,411 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ కింద రూ.35,828 కోట్లు, ఐజీజీఎస్టీ కింద రూ.81,363 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సెస్సుల రూపంలో మరో రూ.11,489 కోట్లుగా వసూలైనట్లు తెలిపింది. అంతకుముందు ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల మేర వసూళ్లు నమోదైన సంగతి తెలిసిందే.
 
అదేసమయంలో జీఎస్టీ వసూళ్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ రూ.3047 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు సాధించగా.. ఈ ఏడాది మే నెలలో రూ.3373 కోట్లు వచ్చాయి. 11 శాతం  వృద్ధి నమోదైంది. తెలంగాణ గతేడాది రూ.3982 కోట్ల మేర వసూళ్లు సాధించగా.. ఈ ఏడాది మే నెలలో 13 శాతం వృద్ధితో రూ.4507 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఈ విషయంలో ఎప్పటిలానే 16 శాతం వృద్ధితో మహారాష్ట్ర 23,536 కోట్ల మేర వసూళ్లను సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments