Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారంతో పోటీపడుతున్న వెండి - రోజురోజుకూ పెరుగుతున్న ధరలు!!

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (10:04 IST)
బంగారం ధరలతో వెండి ధరలు పోటీపడుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ కారణంగా దేశీయంగా రికార్డు స్థాయి గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.92,150లకు చేరుకుంది. అదేసమయంలో బంగారం ధర రూ.92 వేలకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
ఇదే సమయంలో వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగి ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. కిలో వెండి ధర రూ.1.03 లక్షలకు చేరుకుంది. గత యేడాదిలో బంగారం, వెండి ధరలు 37 శాతం మేరకు పెరగగా, గత నెలలో బంగారం ధర 6.70 శాతం, వెండి ధర రూ.8.80 శాతం మేరకు పెగిగాయి. 
 
2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బంగారం 31.37 శాతం రాబడిని ఇవ్వగా వెండి మాత్రం దానికంటే అధికంగా 35.56 శాతం రాబడిని అందిచింది. బంగారం, వెండి పెట్టుబడిదారులకు అధిక లాభాలను అందిస్తుండటం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. బంగారం కంటే వెండి ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో వెండి ధరలు రూ.1.25 లక్షలు దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments