Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

కర్నూలులో ప్యూర్ కొత్త షోరూమ్ ప్రారంభం

Advertiesment
Pure

ఐవీఆర్

, శనివారం, 29 మార్చి 2025 (21:06 IST)
ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్వచ్ఛ ఇంధన ఆవిష్కరణలలో అగ్రగామిగా ఉన్న ప్యూర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో మరో షోరూమ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్-సర్వీస్ 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇది అత్యుత్తమ ఉత్పత్తులను అందించే బ్రాండ్ యొక్క అధునాతన సాంకేతికతను ప్రత్యక్షముగా వీక్షించటానికి వినియోగదారులకు అద్భుతమైన ప్రాంగణాన్ని అందిస్తుంది.
 
కొత్త షోరూమ్ పర్యావరణ అనుకూలమైన, స్వచ్ఛమైన, అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న రవాణా పరిష్కారాలు, ఇంధన నిల్వ ఉత్పత్తుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తూ ప్యూర్ యొక్క పూర్తి ఉత్పత్తి శ్రేణిని ప్రదర్శిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖల గౌరవ మంత్రి శ్రీ టిజి భరత్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ ప్రాంతం యొక్క సస్టైనబిలిటీ లక్ష్యాలకు దోహదపడుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇంధన నిల్వ ఉత్పత్తులలో కంపెనీ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.
 
"కర్నూలులోని ఈ కొత్త షోరూమ్ పర్యావరణ అనుకూల రవాణా, నమ్మకమైన గృహ ఇంధన ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్ పౌరులను శక్తివంతం చేయాలనే అచంచలమైన నిబద్ధతను ప్రదర్శిస్తుంది" అని ప్యూర్ సహవ్యవస్థాపకుడు - సీఈఓ శ్రీ రోహిత్ వదేరా అన్నారు. ఆయనే మాట్లాడుతూ "దేశం యొక్క ఇంధన పరివర్తనను వేగవంతం చేసే గృహాలు, వాణిజ్య సంస్థలు మరియు గ్రిడ్‌లకు ఉపయోగపడే ప్యూర్ పవర్ ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను ప్యూర్ ఇటీవల ఆవిష్కరించింది" అని అన్నారు. 
 
ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి శ్రీ టి జి భరత్ మాట్లాడుతూ "కర్నూలులోని ప్యూర్ కొత్త షోరూమ్ స్వచ్ఛమైన, హరిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వ లక్ష్యం సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. అందుబాటు ధరలలో పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాలను అందించే ఈ కీలకమైన కార్యక్రమంలో  భాగం కావడం సంతోషంగా వుంది " అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)