Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ సేవింగ్ - గ్రీన్ ఇన్వెర్టర్ టెక్నాలజీతో గోడ్రెజ్ సరికొత్త ఏసీ

హోం అప్లయెన్సెస్ తయారీలో అగ్రగామిగా ఉన్న గోడ్రెజ్ కంపెనీ తాజాగా సరికొత్త ఏసీని అవిష్కరించింది. ఈ కంపెనీ బుధవారం పవర్ సేవింగ్, గ్రీన్ ఇన్వెర్టర్ ఎయిర్ కండీషనర్‌ను విడుదల చేసింది. ఎన్ఎక్స్‌డబ్ల్యూ పేరుత

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:06 IST)
హోం అప్లయెన్సెస్ తయారీలో అగ్రగామిగా ఉన్న గోడ్రెజ్ కంపెనీ తాజాగా సరికొత్త ఏసీని అవిష్కరించింది. ఈ కంపెనీ బుధవారం పవర్ సేవింగ్, గ్రీన్ ఇన్వెర్టర్ ఎయిర్ కండీషనర్‌ను విడుదల చేసింది. ఎన్ఎక్స్‌డబ్ల్యూ పేరుతో 5.8 ఈస్సీర్‌ రేటింగ్‌తో ఈ ఏసీ అందుబాటులోకి వచ్చింది. గోడ్రెజ్ ఎన్ఎక్స్‌డబ్ల్యూ ఇన్వెర్టర్ ఏసీలను యునిక్యూ గ్రీన్ ఇన్వెర్టర్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇన్వెర్టర్ టెక్నాలజీ, గ్రీన్ బ్యాలెన్స్ టెక్నాలజీలు ఒకదానికొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎకో ఫ్రెండ్లీగా పని చేస్తూ అధిక విద్యుత్ ఆదాకు దోహదం చేస్తాయి. 
 
ఈ ఏసీ ఆవిష్కరణ సందర్భంగా గోడ్రెజ్ అప్లయెన్సెన్స్ బిజినెజ్ హెడ్ కమల్ నంది మాట్లాడుతూ వినియోగదారులకు ఎకో ఫ్రెండ్లీగా పని చేసేలా వీటిని తయారు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా ఏసీల విభాగంలో పెట్టుబడులను రెట్టింపు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే 2018 నాటికి దేశీయంగా 5 స్టార్, ఇన్వెర్టర్ ఏసీ సెగ్మెంట్‌లో తమ కంపెనీ 20 శాతం వాటాను దక్కించుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 
 
భారత వాతావరణ శాఖ అంచనా మేరకు.. ఈ యేడాది ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదుకానున్నాయని, దీన్ని రుజువు చేసేలా ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయన్నారు. అందువల్ల ఈ యేడాది ఏసీల విక్రయాలు ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. అలాగే, తాము కొత్తగా ప్రవేశపెట్టిన గోడ్రెజ్ ఎన్ఎక్స్‌డబ్ల్యూ ఏసీ వినియోగదారు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు.

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments