Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రేతల కోసం జీరో కమీషన్‌‌ను పరిచయం చేసిన గ్లో రోడ్‌

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (14:18 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ సోషల్‌ కామర్స్‌ కంపెనీలలో ఒకటైన గ్లో రోడ్‌ తాము నేటి నుంచి నూతన మరియు ప్రస్తుత విక్రేతల కోసం జీరో కమీషన్‌ ను పరిచయం చేసినట్లు వెల్లడించింది. దీనితో గ్లో రోడ్‌ విక్రేతలు, ఆన్‌లైన్‌లోకి ఫీజులను గురించి ఎలాంటి బాధ లేకుండా మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడంతో పాటుగా తమ ఉత్పత్తులను విక్రయించడం సాధ్యమవుతుంది.


వారు కేవలం వర్తించేటటువంటి రవాణా మరియు లాజిస్టిక్స్‌ సేవల కోసం తగిన మొత్తాలను చెల్లిస్తే సరిపోతుంది. అన్ని విభాగాలలోనూ జీరో కమీషన్‌ను పరిచయం చేయడం వల్ల దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారవేత్తలు (ఎంఎస్‌ఎంఈలు)కు మరిన్ని అవకాశాలను సృష్టించడంలో సహాయపడుతుంది.
 
మరింత మంది విక్రేతలు ఆన్‌లైన్‌లో తమ ఎంపికను తీసుకురావడం వల్ల గ్లో రోడ్‌ ఇప్పుడు విభిన్న విభాగాల్లోకి విస్తరించడమూ సాధ్యమవుతుంది. వీటి తో పాటుగా గ్లో రోడ్‌ ఇప్పుడు పలు ఆఫర్లు, వాలెట్‌ క్రెడిట్స్‌ను సైతం అందిస్తుంది. ఇది ఇన్ల్ఫూయెన్సర్లకు సంపాదించడంతో పాటుగా తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునే అవకాశమూ అందిస్తుంది.
 
గ్లోరోడ్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ కునాల్‌ సిన్హా మాట్లాడుతూ, ‘‘భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఎంఎస్‌ఎంఈలు మరియు వ్యవస్ధాపకుల కోసం డిజిటల్‌  వాణిజ్యంను చేరువ చేయడానికి మేము గ్లోరోడ్‌ను ప్రారంభించాము. లిస్టింగ్‌ మరియు గ్లోరోడ్‌పై విక్రయాల కోసం జీరో కమీషన్‌ పరిచయం చేయడమ్నది  ఆ దిశగా వేసిన ఓ ముఖ్యమైన ముందడుగు. ఇది దేశవ్యాప్తంగా ప్రస్తుత మరియు మొట్టమొదటిసారిగా విక్రేతలు భారతదేశమంతటా తమ చేరికను టియర్‌ 2 మరియు ఆ పైన మార్కెట్‌లకు విస్తరించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ–కామర్స్‌కు తొలిసారి గా చెప్పబడుతున్న వినియోగదారులకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మరియు నమ్మకమైనదిగా మారుస్తూ  గ్లోరోడ్‌ యొక్క సేవలను వినియోగించుకునేలా విక్రేతలు మరియు ఇన్ల్ఫూయెన్సర్‌లపై  దృష్టిసారించాము’’ అని అన్నారు.
 
గృహిణిలు, యువత, చిరు వ్యాపారాలు, ఇతరులు సహా  డిజిటల్‌ వ్యాపారవేత్తలుగా మారాలనే లక్షలాది మంది వినియోగదారులకు  సోషల్‌మీడియా యొక్క శక్తిని వినిమోగించడం ద్వారా వారి ఇంటి నుంచి లేదా ఎక్కడ నుంచైనా సులభంగా సంపాదించడానికి  ఓ మార్గాన్ని  గ్లోరోడ్‌ అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments