దేశంలో మరోమారు పెట్రోల్ చార్జీలు పెరిగాయి. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వీటి ధరలు ఇపుడ మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా పేరుగుదల మేరకు హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్‌పై 17 పైసలు మేరకు పెరిగింది. దీంతో ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.109.83కు చేరింది. అలాగే, డీజల్‌పై 16 పైసలు పెరగగా లీటరు ధర రూ.97.98కి చేరింది.
మరోవైపు, ఏపీలోని విజయవాడ నగరంలో మాత్రం భిన్నంగా 11 పైసలు తగ్గింది. దీంతో ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.111.92గా వుంది. లీటర్ డీజల్‌పై రూ.9 పైసలు తగ్గి రూ.99.65కి చేరింది.
ఇదిలావుంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజల్ ధరలపై వసూలు చేస్తూ వచ్చిన ఎక్సైజ్ సుంకంలో కొంతమంది మేరకు తగ్గించిన విషయం తెల్సిందే. పెట్రోల్ ధరలో రూ.9, డీజల్ ధరలో రూ.7 మేరకు తగ్గించింది. దీంతో కాస్త ఉపశమనం కలిగిందని భావించిన సామాన్యులకు మళ్లీ సోమవారం నుంచి పెట్రో వడ్డన ప్రారంభమైంది.