Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన హైదరాబాద్ డెలివరీ సెంటర్‌తో భారతదేశంలో కార్యకలాపాలను విస్తరిస్తోన్న గ్లోబల్‌లాజిక్

ఐవీఆర్
మంగళవారం, 12 నవంబరు 2024 (22:16 IST)
హిటాచీ గ్రూప్ కంపెనీ, డిజిటల్ ఇంజనీరింగ్‌లో అగ్రగామిగా ఉన్న గ్లోబల్‌లాజిక్ ఈరోజు హైదరాబాద్‌లో తమ నూతన డెలివరీ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కంపెనీ వృద్ధి-విస్తరణ వ్యూహంలో భాగంగా, ఈ కేంద్రం గత 9 నెలల్లో 4వ కేంద్ర ప్రారంభాన్ని సూచిస్తుంది. కంటెంట్ ఇంజనీరింగ్ వ్యాపారంపైనిరంతరదృష్టినికొనసాగిస్తూనే, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఆటోమోటివ్, బ్యాంకింగ్, ప్రొఫెషనల్ సర్వీసెస్, మరిన్నింటితో సహా పలు రంగాల వ్యాప్తంగా అధునాతన డిజిటల్ ఇంజనీరింగ్ పరిష్కారాలను అందించడానికి, కంపెనీ యొక్క ప్రధాన ఇంజనీరింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ విస్తరణ చేయబడింది.
 
తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ డి.శ్రీధర్ బాబు చేతుల మీదుగా కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. హైదరాబాద్‌లో ఆవిష్కరణను ప్రోత్సహించడానికి, దాని కార్యకలాపాలను విస్తరించడానికి గ్లోబల్‌లాజిక్  చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వ నిబద్ధతను ఆయన వెల్లడించారు, అదే సమయంలో వృద్ధి, ఆవిష్కరణలను నడపడంలో ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
 
మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “గ్లోబల్‌లాజిక్ యొక్క కొత్త డెలివరీ సెంటర్ ప్రారంభోత్సవం, డిజిటల్ ఇన్నోవేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ప్రపంచ అగ్రగామిగా నిలువాలనే తెలంగాణ యొక్క ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది’’ అని అన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ “ దాదాపు 220కి పైగా జిసిసిలు, ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలు, 1.5 లక్షల మంది ఇంజనీర్‌లతో సహా ఏటా 2.5 లక్షల మంది గ్రాడ్యుయేట్‌లను జోడించే ప్రతిభావంతులతో తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ముందుకు ఆలోచించే సంస్థలకు భవిష్యత్తును రూపొందిస్తోంది. ఈ కొత్త సదుపాయం ఉద్యోగ కల్పనను ప్రోత్సహిస్తుంది. అత్యాధునిక ప్రతిభను పెంపొందిస్తుంది, అధిక ప్రభావ రంగాలలో మన రాష్ట్ర నాయకత్వాన్ని బలపరుస్తుంది. ఇది ప్రపంచ వృద్ధి, ఆవిష్కరణలలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ స్థానాన్ని పటిష్టం చేస్తుంది, మన రాష్ట్రం తదుపరి తరం డిజిటల్ పురోగతికి నాయకత్వం వహించే భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది.." అని అన్నారు. 
 
ఈ విస్తరణతో, గ్లోబల్‌లాజిక్ హైదరాబాద్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను  గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. నగరం యొక్క విస్తారమైన ఇంజనీరింగ్ ప్రతిభావంతులను ఒడిసిపట్టుకోవాలని కంపెనీ యోచిస్తోంది, దాని పెరుగుతున్న కార్యకలాపాలకు మద్దతుగా కొత్త నియామకాలపై దృష్టి సారిస్తుంది. అదనంగా, గ్లోబల్‌లాజిక్ ఇటీవలి మొబివైల్‌ను కొనుగోలు చేసిన తర్వాత, 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద కేంద్రంలో గణనీయమైన సంఖ్యలో మొబివైల్ ఉద్యోగులు కూడా భాగమయ్యారు.
 
“వివిధ రంగాలలో మా ఇంజినీరింగ్ సామర్థ్యాలను పెంపొందించడానికి హైదరాబాద్ నగరం యొక్క బలాన్ని ఉపయోగించుకోవడం పట్ల మేము ఆసక్తిగా ఉన్నాము. మా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జిసిసి) వ్యూహంలో హైదరాబాద్ పాత్రను పటిష్టం చేస్తూ మా గ్లోబల్ క్లయింట్‌ల పెరుగుతున్న డిమాండ్‌లను తీర్చడానికి ఈ  కొత్త కేంద్రం మా బృందాన్ని విస్తరించడానికి అనుమతిస్తుంది.  సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఇతర నూతన తరపు సాంకేతికతలలో ప్రత్యేకించి జెన్ ఏఐ లో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను చేరుకోవడాన్ని మా రిక్రూట్‌మెంట్ ప్రయత్నాలు లక్ష్యంగా చేసుకుంటాయి. హైదరాబాద్ యొక్క ప్రతిభావంతులైన ఉద్యోగులు  మరియు సహాయక వాతావరణంతో, ఇంజనీరింగ్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు మా గ్లోబల్ కార్యకలాపాలలో మెరుగైన పరిష్కారాలను అందించడానికి మేము పూర్తిగా సన్నద్ధమయ్యాము" అని గ్లోబల్‌లాజిక్‌ వద్ద APAC హెడ్  మరియు మేనేజింగ్ డైరెక్టర్  పీయూష్ ఝా అన్నారు.
 
గ్లోబల్‌లాజిక్ యొక్క అంతర్జాతీయ విస్తరణలో  హైదరాబాద్ కీలకమైన కేంద్రంగా మారింది, భారతదేశంలో మరియు వెలుపల కంపెనీ యొక్క విస్తృత వృద్ధి వ్యూహానికి మద్దతు ఇస్తుంది. భారతదేశంలోని అనేక సాంకేతిక విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలతో తన పరిశ్రమ-అకాడెమియా ప్రోగ్రామ్ ద్వారా గ్లోబల్‌లాజిక్ భాగస్వామ్యం కలిగి ఉంది, జెన్ ఏఐ లో విద్యార్థులు వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే ముందు వారికి శిక్షణనిస్తుంది, డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇస్తుంది. కొనసాగుతున్న ప్రభుత్వ మద్దతుతో ఈ నగరం భారతదేశంలోని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జిసిసి లు)కి అగ్రగామి గమ్యస్థానంగా మారింది. ఈ విస్తరణ వివిధ పరిశ్రమలలోని క్లయింట్‌లకు వినూత్న డిజిటల్ పరిష్కారాలను అందించడానికి గ్లోబల్‌లాజిక్  యొక్క ప్రయత్నాలకు  అనుగుణంగా ఉంటుంది, ఈ మిషన్‌లో హైదరాబాద్ కీలక పాత్ర పోషించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments