Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో అత్యంత అందుబాటు ధరలో రియాల్ట్రిస్-ఏజెడ్‌ను విడుదల చేసిన గ్లెన్‌మార్క్‌

Webdunia
సోమవారం, 3 మే 2021 (23:28 IST)
పరిశోధనాధారిత, అంతర్జాతీయంగా సమగ్రమైన ఔషద కంపెనీ, గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ ఇప్పుడు భారతదేశంలో మోస్తరు నుంచి తీవ్రమైన అలెర్జిక్‌ రినిటీస్‌ లక్షణాల చికిత్స కోసం రియాల్ట్రిస్-ఏజెడ్‌‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఊపిరితిత్తుల విభాగంలో అగ్రగామిలలో ఒకటిగా ఉన్న గ్లెన్‌మార్క్‌, బ్రాండెడ్‌ జెనిరిక్‌ వెర్షన్‌ను అత్యంత సరసమైన ధరలో భారతదేశంలో అలెర్జిక్‌ రినిటీస్‌ చికిత్స కోసం విడుదల చేసిన మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. ఇది రోగులకు పూర్తి సౌకర్యాన్ని అందించడంతో పాటుగా దేశంలో అత్యంత చవకైన చికిత్సను సైతం అందిస్తుంది.
 
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మోమెటసోన్‌ ఫ్యురేట్‌ 50ఎంసీజీ+అజెలస్టిన్‌ 140ఎంసీజీని ల స్థిర మోతాదు సమ్మేళనంగా రియాల్ట్రిస్‌-ఏజెడ్‌ను విడుదల చేసిన మొట్టమొదటి కంపెనీ గ్లెన్‌మార్క్‌. ఓ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 20–30% మంది అలెర్జిక్‌ రినిటీస్‌తో బాధపడుతున్నారు. అంతేకాదు, రోగులు తమ ఔషద ఖర్చును సైతం తామే భరించాల్సి ఉంటుంది. చికిత్సావకాశాలపై పెను ప్రభావం చూపే అంశమిది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్‌ 10 బ్రాండ్లు ఇదే తరహా లక్షణాలు కలిగిన వ్యాధి చికిత్సకు విడుదల చేసిన ఔషదాల సరాసరి వెల 365 రూపాయలుగా ఉంటే రియాల్ట్రిస్-ఏజెడ్‌ నాజల్‌ స్ర్పేను కేవలం 175 రూపాయల ధరలో 75మీటర్డ్‌ డోసెస్‌ (ఎండీ) ప్యాక్‌ను అందిస్తుంది.
 
రియాల్ట్రిస్‌-ఏజెడ్‌ నాజల్‌ స్ర్పేను గ్లెన్‌మార్క్‌ అభివృద్ధి చేసింది. యాంటీ హిస్టమిన్‌ మరియు స్టెరాయిడ్‌ల సమ్మేళనంతో 12 సంవత్సరాల వయసు దాటి, అలెర్జిక్‌ రినిటీస్‌ (ఏఆర్‌) లక్షణాలు కలిగిన వ్యక్తులకు నోవెల్‌ ఫిక్స్‌డ్‌ డోస్‌ సమ్మేళనంగా నిలుస్తుంది. ముక్కుదిబ్బడ, ముక్కు కారడం, ముక్కు దురద, తమ్ములు వంటి లక్షణాలతో పాటుగా కళ్లు దురద, నీరు కారడం, ఎర్రగా మారడం వంటి లక్షణాల నుంచి సైతం ఇది ఉపశమనం కలిగిస్తుంది.
 
అలోక్‌ మాలిక్‌, గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ బిజినెస్‌ హెడ్‌, ఇండియా ఫార్ములేషన్స్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశ వ్యాప్తంగా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు తాజా చికిత్సావకాశాలను అందిస్తోన్న సంస్థ గ్లెన్‌మార్క్‌. మా బ్రాండ్‌ రియాల్ట్రిస్‌-ఏజెడ్‌ను పరిచయం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము. దీనిని క్లీనికల్‌గా అధ్యయనం చేయడంతో పాటుగా విప్లవాత్మకంగా అత్యంత అందుబాటు ధరలో దేశవ్యాప్తంగా రోగులకు అందిస్తున్నాం. గ్లెన్‌మార్క్‌ వరకూ దృష్టి సారించిన అత్యంత కీలక విభాగాలలో శ్వాస సంబంధిత విభాగం ఒకటి. ఈ ఉత్పత్తి ఆవిష్కరణతో ప్రభావవంతమైన, సౌకర్యవంతమైన, ప్రపంచశ్రేణి, అందుబాటు ధరలలోని చికిత్సావకాశాలను భారతదేశంలోని రోగులకు అందించడం వీలవుతుంది’’ అని అన్నారు.
 
తీవ్రమైన అప్పర్‌ రెస్పిరేటరీ వ్యాధి అలెర్జిక్‌ రినిటీస్‌. ప్రపంచవ్యాప్తంగా 10-40% ప్రజలు దీని బారిన పడుతున్నారు. అయితే, అలెర్జిక్‌ రినిటీస్‌ కారణంగా ఉత్పాదకత తగ్గడం, నిద్ర లేమి సమస్యలు మరియు ఔట్‌డోర్‌ యాక్టివిటీస్‌ తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. రియాల్ట్రిస్‌–ఏజెడ్‌ ఇప్పుడు ఓరల్‌ చికిత్సలతో పోలిస్తే ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.
 
ఇతర చికిత్సలతో పోలిస్తే ఇంట్రానాజల్‌ కోర్టికోస్టెరాయిడ్‌ (ఐఎన్‌సీఎస్‌) మరియు ఇంట్రానాస్‌ యాంటిహిస్టమైన్‌ (ఐఎన్‌ఏహెచ్‌) నాజల్‌ స్ర్పే సమ్మిళిత చికిత్సగా అలెర్జిక్‌ రినిటీస్‌లో వేగంగా లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. పునరుద్ధరించిన ఏఆర్‌ఐఏ (అలెర్జిక్‌ రినిటీస్‌ మరియు ఆస్తమా పై దీని ప్రభావం) మార్గదర్శకాలు ఇంట్రానాజల్‌ కోర్టికోస్టెరాయిడ్‌ మరియు ఇంట్రానాజల్‌ యాంటిహిస్టమిన్‌ను మధ్యస్థం నుంచి తీవ్రమైన అలెర్జిక్‌ రినిటీస్‌లో మొదటి చికిత్సగా సిఫార్సు చేస్తున్నాయి. సాంకేతిక ప్రయోజనం మరియు రియాల్ట్రిస్‌-ఏజెడ్‌ సరసమైన ధరతో, ఈ ప్రయోజనాలను మోస్తరు నుంచి తీవ్రమైన అలెర్జిక్‌ రినిటీస్‌ లక్షణాలతో ఇబ్బంది పడుతున్న భారతీయ రోగులకు బదిలీ చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments