తన వ్యక్తిగత వాటా నుండి ప్రూడెంట్ షేర్లను బహుమతిగా ఇస్తోన్న శ్రీ సంజయ్ షా

ఐవీఆర్
గురువారం, 13 మార్చి 2025 (17:14 IST)
అహ్మదాబాద్: ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్(ప్రూడెంట్) ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ షా, తన వ్యక్తిగత హోల్డింగ్‌ల నుండి దాదాపు 650 మందికి సుమారు రూ. 34 కోట్లు (నేటి ధర ప్రకారం) విలువైన 175,000 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారులలో కంపెనీ ఉద్యోగులు, దాని పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థలు, అలాగే ఇంటి పనివారు, డ్రైవర్లు వంటి శ్రీ షా వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు.
 
వ్యాపారంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞతగా శ్రీ షా ఈ బహుమతి అందించనుండటంతో పాటుగా ఎలాంటి బాధ్యతలు లేదా నిలుపుదల షరతులు జతచేయలేదు. శ్రీ సంజయ్ షా ఈ నిర్ణయం గురించి కంపెనీకి తెలియజేశారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సహా నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన నియంత్రణ ఆమోదాలను కంపెనీ (అంటే ప్రూడెంట్) తీసుకుంది.
 
ఈ కార్యక్రమం గురించి శ్రీ సంజయ్ షా మాట్లాడుతూ, "ఇది కేవలం షేర్ల బదిలీ కాదు; ఈ ప్రయాణంలో ఉద్యోగులుగా మాత్రమే కాకుండా, సహచరులుగా నాతో పాటు నిలిచిన వారికి నాదైన రీతిలో చెప్పే హృదయపూర్వక కృతజ్ఞత . మీ నిశ్శబ్ద సహకారం, విధేయత, మా ఉమ్మడి లక్ష్యంపై నమ్మకం అమూల్యమైనవి, మన విజయానికి అవి పునాదిగా నిలిచాయి. మనం కలిసి సృష్టించే అద్భుతమైన భవిష్యత్తు కోసం నేను ఆసక్తిగా ఉన్నాను" అని అన్నారు. కాటలిస్ట్ అడ్వైజర్స్ లావాదేవీకి సలహాదారుగా వ్యవహరించారు మరియు SEBI నుండి సంబంధిత ఆమోదాలను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments