Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఖాతాతో ప్రపంచ ఈక్విటీల్లో పెట్టుబడి.. ఎలా సాధ్యం?

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (11:45 IST)
ఇకపై ఒకే ఖాతాతో ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ విధానం చిన్న మదుపర్లు, ఐటీ వృత్తి నిపుణులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంతకీ ఒకే ఖాతాలో ప్రపంచంలో ఎక్కడైనా ఎలా పెట్టుబడి పెట్టొచ్చో ఇపుడు తెలుసుకుందాం. 
 
దేశంలో ఉన్న ప్రముఖ బోకరేజ్ కంపెనీల్లో జియోజిత్ (కృత్రిమమేథ) ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి. ఈ సంస్థ ఇపుడు సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. చిన్న మదుపర్లకు, అధిక సంపన్న మదుపర్లకు, ఐటీ వృత్తి నిపుణులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ముఖ్యంగా, ప్రపంచ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారి కలను నెరవేర్చేందుకు ఇది ఎంతో దోహదపడనుంది. 
 
జియోజిత్ తీసుకొచ్చిన ప్లాట్‌ఫాం ద్వారా అమెరికా సహా ప్రపంచంలోని ఏ దేశంలోని సెక్యూరిటీల్లోనైనా ఒకటే ఖాతాతో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇందుకోసం న్యూయార్క్‌కు చెందిన గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం స్టాకాల్ భాగస్వామ్యంతో చేతులు కలిపిన జియోజిత్ ఏఐ (కృత్రిమమేథ) ఆధారిత గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది.
 
ఇదే అంశంపై అమెరికా కంపెనీ స్టాకాల్ ఫౌండర్, సీఈవో సీతావ్వ శ్రీవాస్తవ స్పందిస్తూ, తమ ప్లాట్‌పామ్ ద్వారా భారత్ నుంచి రోజుకు సగటున 2 మిలియన్ డాలర్ల లావాదేవీలు జరుగుతున్నట్టు చెప్పారు. 
 
అమెజాన్, యాపిల్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, టెస్లా వంటి దిగ్గజ సాంకేతిక షేర్లతోపాటు బంగారం, వెండి, చమురు లాంటి కమొడిటీ ఈటీఎఫ్‌లలో, ట్రెజరరీ ఈటీఎఫ్‌లలో సుమారు 12 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టినట్టు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments