Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధిరేటులో పాకిస్థాన్ కంటే వెనుకబడిన భారత్?

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (12:01 IST)
ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నది ప్రతి ఒక్కరి భావన. కానీ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన జీడీపీ వృద్ధిరేటులో భారత్ ఆరేళ్ళ కనిష్టానికి పడిపోయింది. పైగా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్ వంటి దేశాల వృద్ధిరేటు కంటే తక్కువగా నమోదైంది. ప్రస్తుతం భారత్ వృద్ధిరేటు 5 శాతంగా ఉంటే, పాకిస్థాన్ వృద్ధిరేటు 5.4 శాతం, భూటన్ వృద్ధిరేటు 7.4 శాతం, నేపాల్ వృద్ధిరేటు 7.9 శాతం, బంగ్లాదేశ్ 8.31 శాతంగా ఉన్నట్టు ఎకనామిక్ టైమ్స్ పత్రిక గత నెల 30వ తేదీన వెల్లడించింది.
 
మరోవైపు ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్కామ్‌లో అరెస్టు అయిన కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం కూడా ఈ వృద్ధిరేటుపై వెటకారంగా మాట్లాడారు. ఆయన కోర్టు నుంచి బయటకు వస్తుండగా ఒక విలేకరి తన కస్టడీ గురించి చెప్పాలని కోరగా 'రాజకీయ నాయకులు చెప్పాలి.. ఐదు శాతం. 5 శాతం అంటే ఏమిటో మీకు తెలుసా?' అని ఎగతాళిగా మాట్లాడుతూ.. తన ఐదు వేళ్లను మీడియాకేసి చూపారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఐదు శాతం క్షీణించింది అనడానికి ఉదాహారణగా చిదంబరం ఐదు వేళ్లను చూపించారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి మందగించి, ఆరు సంవత్సరాల కనిష్టానికి చేరిన నేపథ్యంలో చిదంబరం ఇలా తన చేతి వేళ్లతో బీజేపీ ప్రభుత్వ పని తీరును ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments