Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బజార్ నుంచి తీపి కబురు.. ఆన్‌లైన్ ఆర్డర్ సర్వీసులు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (13:04 IST)
Big Bazaar
బిగ్ బజార్ తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ ఆర్డర్ సర్వీసులు ప్రారంభించింది. అంతేకాకుండా హోమ్ డెలివరీ సేవలు కూడా అందిస్తోంది. అది కేవలం 2 గంటల్లోనే మీ ప్రొడక్టులు మీ ఇంటికి వచ్చేస్తాయి. హైపర్ మార్కెట్ చెయిన్‌గా వ్యవహరిస్తూ హోమ్ డెలివరీ సర్వీసులు అందించడం ఇదే ప్రథమమని బిగ్ బజార్ తెలిపింది. 
 
ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి, అలాగే డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి బిగ్ బజార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో ముంబై, బెంగళూరు, ఢిల్లీలో ఈ సర్వీసులు ప్రారంభించామని కంపెనీ తెలిపింది. వచ్చే 45 రోజుల్లో దేశవ్యాప్తంగా 150 పట్టణాల్లో హోమ్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది. 
 
రోజులకు లక్ష వరకు హోమ్ డెలివరీ రిక్వెస్ట్‌లను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించింది. కంపెనీ డిజిటల్ కార్యకలాపాలన పెంచుకోవడానికి అవసరమైన ఇన్వెస్ట్‌మెంట్లు చేశామని తెలిపింది. గత 15 నెలలుగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తూ వస్తున్నామని కంపెనీ పేర్కొంది. కస్టమర్ల నుంచి డెలివరీ చార్జీల కింద రూ.49 వసూలు చేస్తామని తెలిపింది. రూ.1000కు పైన ఆర్డర్లకు ఇది వర్తిస్తుంది. కనీసం రూ.500 ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments