Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైవర్స్ ఎబిలిటీ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ద్వారా వైవిధ్యానికి పెద్దపీట వేసిన ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (21:44 IST)
డైవర్స్ ఎబిలిటీ డే సందర్భంగా, ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూ రెన్స్ కంపెనీ లిమిటెడ్ 2021లో ఎఫ్­జి డైవర్స్ ఎబిలిటీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది ఒక గుణాత్మక కార్యక్రమంగా ప్రారంభించబడింది; ఇది ఇప్పుడు ఏటా అమలు చేయబడుతోంది. తప్పనిసరి రక్షణాత్మక కార్యక్రమం లేకుండా కూడా ఎవరైనా ఇతర ఇంటర్న్‌లను నియమించుకునే విధం గానే విభిన్నమైన ఇంటర్న్‌లను కంపెనీతో కలసి పని చేసేలా చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ విశిష్ట కార్యక్రమం కింద, ప్రత్యేక సామర్థ్యం గల అభ్యర్థులను రెండు నెలల వ్యవధికి గాను ఇంటర్న్‌షిప్ స్థానాలకు నియమించుకుంటారు. ప్రోగ్రామ్‌ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఇంటర్న్‌లు దీర్ఘకాలిక ఉద్యోగావకాశాలను పొందే వీలుంది.
 
విభిన్న అవసరాలు, నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు ఉపాధిని మెరుగుపరచడం, అందించడం అనే ఉద్దేశం తో డైవర్సిటీ ఇంటర్న్‌షిప్ ప్రారంభించబడింది. అటువంటి కార్యక్రమాలకు అతిపెద్ద శత్రుత్వం టోకెనిజం. ఈ కార్యక్రమంలో మాత్రం ఈ తరహా నియామకాల్లో పలు విభా గాలు, విధులను చేర్చడం ద్వారా టోకెనిజంను తప్పించుకోవడానికి ఒక అవగాహనతో కూడిన ప్రయత్నం జరిగింది. ఇది వైకల్యాన్ని దాటి చూసే, విధులను నిర్వహించగల వ్యక్తి సామర్థ్యంపై దృష్టి సారించే నిజమైన దీర్ఘకాలిక, సుస్థిరమైన సంస్కృతిని సృష్టించడం లక్ష్యంగా జరుగుతోంది.
 
ఈ ప్రోగ్రామ్ మొదటి దశ డిసెంబర్ 2021లో ప్రారంభించబడింది, ఇక్కడ మొత్తం ముగ్గురు ఇతరేతర సామ ర్థ్యాలు గల (వికలాంగ) ఇంటర్న్‌లను రెండు వర్గాల క్రింద నియమించారు- పాక్షిక శారీరక వైకల్యం మరియు పాక్షిక శ్రవణ వైకల్యం. ప్రోగ్రామ్‌ను అమలుచేసే మొదటి రౌండ్‌లో, అర్హులైన అభ్యర్థులకు ఆహ్వానం (మెయిలర్) పంపబడింది. రెండవ రౌండ్‌లో మూడు విభాగాల- లాజికల్ రీజనింగ్, సంస్థ వ్యూహ ప్రణా ళికపై సందర్భోచిత తీర్పు, కంపెనీకి సంబంధించిన ప్రశ్నలుపై క్విజ్‌లు ఉన్నాయి. మూడవ రౌండ్ ఫంక్షనల్ హెడ్ నిర్వహించే చివరి ఇంటర్వ్యూ.
 
ఈ సందర్భంగా హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ శ్వేత రామ్ మాట్లాడుతూ, ‘‘ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లోని వైవిధ్యం బహుళ కోణాలను కలిగి ఉంది. లింగం, వయస్సు, సంస్కృతి, చేరిక అనే 4 మూలస్తంభాలలో సమగ్రంగా పరిగణించబడుతుంది. వైకల్యంను డైవవర్సిబిలిటీ (వైవిధ్యత)గా వ్యవహరించేందుకు మేం ప్రాధాన్యం ఇస్తాం. ఇది వైవిధ్యానికి సంబంధించిన అంశం.  వైవిధ్యభరితమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల ద్వారా, బలహీనతలకు అతీతంగా చూడడానికి, నిజమైన ప్రతిభను కలిగి ఉన్న నిజమైన ప్రతిభకు సాధికారత కల్పించడానికి అభివృద్ధి చెందిన సంస్కృతిని రూపొందించడం మా లక్ష్యం. వారి ప్రత్యేక సామర్థ్యాలను విధుల్లోకి తీసుకురావాలనే ఆకాంక్ష, సంకల్పం మాకు ఉన్నాయి. ప్రతిఒక్కరికీ భిన్నత్వంపై ఉండే అపోహలు/నమ్మకాలను నిర్వీర్యం చేయడానికి, సరిదిద్దడానికి కూడా ఇది ఒక చక్కటి అవకాశం. వారు వికలాంగులు కాదని, ఇతరేతర సామర్థ్యాలు కలవారని మేం విశ్వసి స్తున్నాం.  ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో ఒక కమ్యూనిటీని నిర్మించాలనే ఆశతో ఇటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా రూపుదిద్దుకుంటాయి. ఇక్కడ మేం నిజమైన ప్రగతిశీల సంస్థగా మారడానికి ముందుకు సాగుతున్నప్పుడు అలాంటి వాటికి అద్దం పట్టేవారిగా, వారి పట్ల మరింత శ్రద్ధగా, సానుభూతితో ఉండవచ్చు’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments