Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ కీలక ప్రకటన.. ఆన్‌లైన్ నగదు బదిలీలపై రుసుముల్లేవు..

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (10:14 IST)
రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. జూలై ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్ ‌(ఆర్‌టీజీఎస్‌), నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) ద్వారా జరిపే నగదు బదిలీలపై రుసుములేవీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ ఈ ప్రకటన చేసినట్లు వెల్లడించింది. 
 
అంతేగాకుండా బ్యాంకులు కూడా వినియోగదారుల నుంచి ఆ రుసుములు వసూలు చేయొద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నెఫ్ట్‌ లావాదేవీలకు రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలకు రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది. 
 
ఇలా ప్రైవేట్ బ్యాంకులు కూడా కొంత మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, నగదు చలామణి తగ్గించడం, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తాజాగా ఈ ఛార్జీలను ఆర్‌బీఐ రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments