Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ముకేష్ అంబానీ.. ఇంటర్నెట్ అందించడంలో?

ఫోర్బ్స్ రూపొందించిన గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న

Webdunia
బుధవారం, 17 మే 2017 (16:48 IST)
ఫోర్బ్స్ రూపొందించిన గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజల జీవనం మార్పులు తీసుకురావడం.. ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడంతో సత్తాచాటారు. గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాను ఫోర్బ్స్ రూపొందించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
 
భారతదేశంలో అత్యధిక మొత్తంలో ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడంలో అంబానీ గేమ్ ఛేంజింగ్ సామర్థ్యంపై ఫోర్బ్స్ ప్రశంసలు కురిపించింది. 25 మంది ధైర్యవంతులైన నాయకులతో కూడిన ఈ జాబితాలో అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 
 
ఆయిల్ గ్యాస్ వరకు వ్యాపారాల్లో సత్తా చాటుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికామ్ మార్కెట్లోకి ప్రవేశించి.. ఉచిత ఆఫర్లు, అత్యంత చవకైన ధరలతో చాలా వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఆఫర్ చేసిందని ఫోర్బ్స్ పేర్కొంది. అంతేగాకుండా, ఆరు నెలల కాలంలోనే 100 మిలియన్ల కస్టమర్ల మార్కును చేరుకుందని రిలయన్స్ జియోను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను కొనియాడింది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments