Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారులపై ఆర్థిక ఉగ్రవాదం: బ్యాంకుల పోకడపై మండిపడుతున్న జనం

పరిమితికి మించిన లావాదావీలపై భారీ చార్జీలను వడ్డిస్తూ దేశంలోని ప్రయివేట్ బ్యాంకులు చేసిన ప్రకటనపై దేశ ప్రజలు, వ్యాపారులు మండిపడుతున్నారు. ఖాదాదారులపై అలాంటి చార్జీల విధింపు వారిపై ఆర్థిక ఉగ్రవాదాన్ని మోపడమే అవుతుందని, సామాన్య ప్రజలను బ్యాంకుల దయాదాక్

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (05:42 IST)
పరిమితికి మించిన లావాదావీలపై భారీ చార్జీలను వడ్డిస్తూ దేశంలోని ప్రయివేట్ బ్యాంకులు చేసిన ప్రకటనపై దేశ ప్రజలు, వ్యాపారులు మండిపడుతున్నారు. ఖాదాదారులపై అలాంటి చార్జీల విధింపు వారిపై ఆర్థిక ఉగ్రవాదాన్ని మోపడమే అవుతుందని, సామాన్య ప్రజలను బ్యాంకుల దయాదాక్షిణ్యాలకు వదిలేయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం మొత్తంగా బ్యాంకుల అతి చర్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కొతమంది ట్వీటర్లు ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని రిజర్వ్ బ్యాంకును అర్థించారు. 
 
అతి త్వరలోనే హచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ బ్యాంకులు తమ వద్ద లావాదేవీలు చేస్తున్నందుకు గాను ప్రివిలైజ్ చార్జిల కింది ప్రతి ఖాతాదారు నెలవారీ బ్యాలెన్స్ నుంచి 2 శాతం లాక్కోవచ్చు. ఆర్బీఐ వెంటనే మేల్కొనాలి. అంటూ ఒక ట్వీటర్ పేర్కొన్నారు. హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు నాలుగుదఫాలకు మించి ఒక నెలలో బ్యాంకులో డిపాజిట్ చేసినా, నగదు ఉపసంహరించుకన్నా అలాంటి వారిపై రూ. 150లు చార్జి విధిస్తున్నట్లు చెప్పడం సిగ్గు. సిగ్గు. మా డబ్బులపై బ్యాంకులు చార్జీలు వేయడమా అంటూ నెటిజన్లు ఆగ్రహించారు. 
 
బ్యాంకులు ఇలాంటి దారుణాలకు పాల్పడితే నేను ఖచ్చితంగా ఈ బ్యాంకుల సేవలు తీసుకోను అని శపథం చేశారు మరొక నెటిజన్,  నగదుతో మాత్రమే లావాదేవీలు జరిపే చిన్న వ్యాపారులు, హ్యాకర్లు వంటివారు ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా దెబ్బతింటారని ఒక రిటైర్డ్ బ్యాంకర్ అంగీకరించారు.అఖిల భారత వర్తక సమాఖ్య మరో అడుగు ముందుకు వేసి ఖాతాదారులపై బ్యాంకులు మోపుతున్న ఆర్థిక ఉగ్రవాదం తప్ప ఇది మరేమీ కాదని వ్యాఖ్యానించింది. అనేక బాధ్యతలను నేరవేర్చడానికి సగటు మనిషి సేవింగ్స్, శాలరీ ఖాతాలను  వాడుతుంటారని, సాధారణ ప్రజానీకానికి ఇలాంటి చార్జీల విధింపు వల్ల తీవ్ర హాని కలుగుతుందని సమాఖ్య అధ్యక్షుడు బీసీ భార్టియా పేర్కొన్నారు.
 
విద్యావేత్త కేఏ విశ్వనాధన్ మాట్లాడుతూ బ్యాంకులు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోకుండా ఆర్బీఐ మార్గదర్శక సూత్రాలను విధించాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకులు తమ అభీష్టానుసారం వ్యవహరిస్తున్నాయి తప్పితే సేవలందించడంలో పారదర్శకత ఏమాత్రం లేదు. బ్యాంకులు ఏమాత్రం ముందస్తు ప్రకటనలు చేయకుండా అలాంటి చార్జీలు విధించడానికి ప్రాతిపదిక ఏమిటి? అని ఆయన విమర్శించారు. చెక్కు చెల్లింపుకు కూడా బ్యాంకులు చార్జీలు విధించడం మొదలుపెట్టేశాయని చెప్పారు.2017 ఏప్రిల్ 1 నుంచి 2వేల రూపాయల కార్డు బిల్లును చెక్కుద్వారా చెల్లిస్తే, వంద రూపాయల చార్జి విధిస్తామని ఎస్‌బిఐ తనకు ఇటీవలే మెసేజ్ పంపిందని విశ్వనాధన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు  సత్వర చెల్లింపులకోసం నెఫ్ట్ ఉపయోగిస్తే ఒక పనిదినంలోనే ఆ చెల్లింపు జమ అవుతుందని విశ్వనాధన్ సలహా ఇచ్చారు.
 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments