Webdunia - Bharat's app for daily news and videos

Install App

2050నాటికి అత్యధిక ముస్లింల దేశంగా భారత్!

వచ్చే 2050నాటికల్లా ప్రపంచంలో ముస్లింల జనాభా అత్యధికంగా ఉండే దేశంగా భారత ఆవిర్భవించనున్నది. అప్పటికి వారి సంఖ్య 30 కోట్లు దాటవచ్చని అమెరికన్‌ మేధో పరిశోధనా సంస్థ ‘ప్యూ రిసెర్చి సెంటర్‌ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రైస్తవం అతిపెద

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (04:50 IST)
వచ్చే 2050నాటికల్లా ప్రపంచంలో ముస్లింల జనాభా అత్యధికంగా ఉండే దేశంగా భారత ఆవిర్భవించనున్నది. అప్పటికి వారి సంఖ్య 30 కోట్లు దాటవచ్చని అమెరికన్‌ మేధో పరిశోధనా సంస్థ ‘ప్యూ రిసెర్చి సెంటర్‌ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రైస్తవం అతిపెద్ద మతం కాగా, రెండవ స్థానంలో ఇస్లాం ఉంది. అయితే ఇస్లాం అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతుండడంతో.... ఈ పెరుగుదల రేటు ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం ముగింపుకల్లా ముస్లింల సంఖ్య క్రైస్తవుల సంఖ్యను మించిపోతుందని ప్యూ రిసెర్చి సెంటర్‌ లెక్కగట్టింది. 
 
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేసియా. ఇక ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా 73 శాతం మేర పెరిగి 2050 నాటికల్లా 280 కోట్లకు చేరవచ్చని ప్యూ రిసెర్చి సెంటర్‌ అంచనా వేసింది. మొత్తానికి ప్రపంచ జనాభా పెరుగుదల రేటు కన్నా రెట్టింపు వేగంతో ముస్లింల జనాభా గ్రూపు మాత్రమే వృద్ధి చెందుతోందని ఈ అధ్యయనంలో తేలింది. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో 62 శాతం ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే ఉంటున్నారు. 
 
ముస్లిం జనాభాలో ఇంత వృద్ధి ఎలా సాధ్యమైంది అంటే ప్రపంచంలోని అన్ని మత బృందాల కంటే అత్యంత యువ వయస్కులు ముస్లింలలోనే ఉన్నారు. క్రిైస్తవమతం తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద మతంగా ఇస్లాం మతం గుర్తింపు పొందింది. ఇది అప్పుడు అతివేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన మతం. జనాభా వృద్ధి ఇలాగే కొనసాగితే 21వ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ ముస్లిం జనాభా, ప్రపంచ క్రిస్టియన్ జనాభాను అధిగమిస్తుందని అమెరికన్ మేధో పరిశోదనా సంస్థ అంచనా వేసింది.
 
2010 నాటికి ప్రపంచంలో ముస్లింల సంఖ్య 160 కోట్లు. వచ్చే దశాబ్దాలలో ముస్లింల జనాభా 35 శాతం వృద్ధి చెందగలదని భావిస్తున్నారు. 20150 నాటికి ముస్లింల సంఖ్య 73 శాతం వృద్ధితో 280 కోట్లకు చేరుకోగలదు. వాస్తవానికి ప్రపంచ జనాభా వృద్ధి కంటే వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన మతం ఇస్లాం కావడం విశేషం. ముస్లింలలో మెజారిటీ అంటే 62 శాతం మంది ప్రస్తుతం ఆసియా-ఫసిపిక్ ప్రాంతంలోనే ఉన్నారు. అంటే ఈ ప్రాంతంలోనే ఇండోనేషియా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, టర్కీ దేశాల్లోనే వీరు ఎక్కువగా ఉన్నారు.
 
ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ముస్లింలను కలిగి ఉన్న దేశం ఇండోనేషియా. అయితే 2050 నాటికి 30 కోట్లమంది ముస్లిం జనాభాతో భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించనుందని అమెరికన్ మేధో పరిశోధనా సంస్థ పేర్కొంది. అయితే అెమెరికాలో నేటికీ అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ముస్లింలు ఉంటున్నందును అమెరికా సమాజంలో వారి పాత్ర చాలా తక్కువని ఈ సంస్థ పేర్కొంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments