Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ దెబ్బకు టర్కీ కంపెనీ సెలెబీ షేరుకు పగటిపూటే చుక్కలు కనిపిస్తున్నాయ్..

ఠాగూర్
శుక్రవారం, 16 మే 2025 (17:35 IST)
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపింది. ఇందుకోసం పాకిస్థాన్‌‍తో పాటు పాక్ ప్రేరిపిత ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ ప్రతిదాడులకు దిగింది. అదేసమయంలో పాకిస్థాన్‌కు టర్కీ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించింది. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్‌కు డ్రోన్లతో పాటు సైనికులను కూడా పంపించింది. ఇది భారత్‌కు ఆగ్రహం తెప్పించింది. టర్కీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, టర్కీకి వాణిజ్యపరంగా ఎదురుగాలివీస్తోంది. టర్కీ సంస్థలతో భారత్ సంస్థలు, వర్శిటీలు సంబంధాలు తెంచుకుంటున్నాయి. ఇలా భారత్ ఎఫెక్ట్ పడిన టర్కీ కంపెనీల్లో సెలెబీ సంస్థ కూడా ఒకటి. ఇది భారత విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించండి. 
 
భారత ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం టర్కీకి చెందిన సెలెబీ ఏవియేషన్ హోల్డింగ్ సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ దెబ్బకు ఇస్తాంబుల్ స్టాక్ మార్కెట్‌లో మే 16న కంపెనీ షేరు ఏకంగా పది శాతం కుప్పకూలిపోయింది. గత నాలుగు వాణిజ్య పనిరోజుల్లోనే ఈ సంస్థ షేరు దాదాపు 30 శాతం మేరకు ఆవిరైపోయింది. భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలను సెలిబీ అనుబంధ సంస్థ అందిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం