అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారు ధరలు మరింత తగ్గుముఖం పట్టింది. ఆల్‌టైమ్ గరిష్టంగా పది శాతం ధర క్షీణించింది. భౌగోళిక ఉద్రిక్తల కారణంగా ఇటీవల భారీగా దూసుకెళ్లిన పసిడి ధర ఇపుడిపుడే దిగొస్తోంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారుతుండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు.
ఈ పరిణామాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1800 తగ్గుముఖం పట్టి, రూ.95,050 పలుకుతోంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి రూ.94,600 వద్ద కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో దీని ధర రూ.95,350 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది.
దేశ రాజధానిలో కేజీ వెండి ధర రూ.97 వేలు పలుకుతోంది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో రూ.98 వేలు ఉన్న వెండి ధర వెయ్యి రూపాయల మేరకు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌గోల్డ్ ఔన్స్ 16 డాలర్లు తగ్గుముఖం పట్టి 3160 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్సు 32 డాలర్ల వద్ద కొనసాగుతోంది.