Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : రైతులకు ఎన్నికల తాయిలం : యేడాదికి రూ.6 వేలు పంటసాయం...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:35 IST)
ఎన్నికల సమయంలో రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాయిలం ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యాల, అప్పుల కారణంగా బక్కచిక్కిపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ముందుకు వచ్చింది. ఇందులోభాగంగా, పీఎం కిసాన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు యేడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. 
 
ఈ పథకం 2018 డిసెంబరు నెల నుంచి అమల్లోకి వస్తుందని విత్తమంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఈ పథకం కింద యేడాదికి 6 వేల రూపాయలను రైతు బ్యాంకు ఖాతాలకే నేరుగా డిపాజిట్ చేస్తామన్నారు. ఈ నిధులను మూడు దఫాలుగా జమ చేస్తామని తెలిపారు. 
 
ఒక్కో దఫాలో రూ.2 వేలు చొప్పు మొత్తం ఆరు వేల రూపాయలను జమ చేస్తామని వివరించారు. మొదటి విడతగా తక్షణఁ రూ.2 వేలు జమ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ పథకం కేవలు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది.

దీనివల్ల 12 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతారని చెప్పారు. ప్రకృతి విపత్తుల్లో పంటలు నష్టపోయిన రైతులకు పంటరుణాలు రీషెడ్యూల్, రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి సమ్మాన్ కిసాన్ నిధికి యేటా రూ.6 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments