రిలయన్స్ జియో - ఎయిర్‌టెల్‌కు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (12:20 IST)
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌కు భారత ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి తేరుకోలేని షాకిచ్చింది. ఇప్పటికే మొబైల్ రీచార్జ్ ప్లాన్లను భారీగా తగ్గించిన బీఎస్ఎన్ఎల్ ఇపుడు సిమ్ కార్డు లేకుండానే మొబైల్ సేవలు పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వియాసత్‌తో కలిసి డైరెక్ట్ టు డివైజ్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ట్రయల్స్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ ఇది అందుబాటులోకి రానుంది. అలాగే, స్మార్ట్ వాచ్‌తో పాటు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ డివైజ్లకు కూడా ఇది సపోర్టు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతోనే ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
డైరెక్ట్ టు డివైజ్ సాంకేతికతతో సిమ్ కార్డు లేకుండానే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కార్ల యజమానులు కూడా నేరుగా శాటిలైట్ నెట్వర్క్‌తో అనుసంధానం కావొచ్చు. పర్సనల్, డివైజ్ కమ్యూనికేషన్‌కు సపోర్ట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు. ఎక్కడున్నామన్న దానితో సంబంధం లేకుండా నిరంతర కనెక్టివిటీని ఇది అందిస్తుంది. యూజర్లకు ఇది గొప్ప కవరేజీ ఇవ్వడంతోపాటు నమ్మకమైన కమ్యూనికేషన్ అందిస్తుంది. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు గొప్ప ఉపయోగకరంగా ఉంటుంది.
 
ముఖ్యంగా, శాటిలైట్ కమ్యూనికేషన్‌లో భాగమైన డైరెక్ట్ టు డివైజ్ సేవల్లో ఇక మొబైల్ టవర్లతో పని ఉండదు. ఇంకా చెప్పాలంటే శాటిలైట్ ఫోన్లలా అన్నమాట. స్మార్ట్‌ఫోన్లూు, స్మార్ట్ వాచ్లు, ఇతర స్మార్ట్ డివైజ్లను నేరుగా ఈ టెక్నాలజీ సాయంతో అంతరాయం లేని కాల్స్ మాట్లాడుకోవచ్చు. ట్రయల్స్‌లో భాగంగా 36 వేల కిలోమీటర్ల దూరంలోని ఉపగ్రహాన్ని ఉపయోగించి దిగ్విజయంగా ఫోన్ కాల్ చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments