Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిమి గరేవాల్‌తో కలిసి బీచ్‌లో రొమాంటిక్ వాక్.. రతన్ టాటా హ్యాపీ (video)

Ratan Tata-Simi Garewal

సెల్వి

, గురువారం, 10 అక్టోబరు 2024 (13:19 IST)
Ratan Tata-Simi Garewal
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, రతన్ టాటా అనారోగ్యంతో మృతి చెందారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన భారతదేశపు పారిశ్రామిక వేత్తలలో రతన్ టాటా ఒకరు. పని కారణంగా జీవితంలోని తరువాతి దశలో ఆయనను ఒంటరి చేసింది.
 
కానీ అతను జీవితంలోని చిన్న ఆనందాలను ఎంతో ఆదరించారు. వాటిలో ఒకటి నటి సిమి గరేవాల్‌తో కలిసి బీచ్‌లో రొమాంటిక్ వాక్ చేయడం. అలాంటి ఒక క్షణాన్ని గుర్తు చేసుకుంటూ, నటి సిమి గరేవాల్‌కి తన చాట్ షో ‘రెండెజౌస్ విత్ సిమి గరేవాల్’లో తాను ఒకప్పుడు తనతో కలిసి బీచ్‌లో ఎలా నడిచానో చెప్పాడు. ఆ క్షణంలోని ప్రశాంతత పనికి సంబంధించిన అన్ని విషయాల గురించి అతని మనస్సును క్లియర్ చేయడంలో సహాయపడిందని చెప్పారు.
 
రతన్ టాటా, సిమి గరేవాల్ ఒకానొక సమయంలో ప్రేమలో పడ్డారు. వాస్తవానికి, వారు పెళ్లికి సిద్ధమయ్యారని, అయితే వారి వివాహం జరగలేదు. ఇకపోతే.. రతన్ టాటా నావల్ టాటా కుమారుడు. తాజాగా రతన్ టాటా స్నేహితురాలు సిమి గరేవాల్ ఆయన మరణంపై స్పందించారు. 
 
"నువ్వు వెళ్లిపోయావని అంతా అంటున్నారు.. ఈ వార్తను భరించడం, తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది.. నీకిదే అంతిమ వీడ్కోలు నేస్తమా" అంటూ ఎమోషనల్ అయింది. ఇక వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి నెట్టింట్లో మరోసారి చర్చలు జరుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రతన్ టాటా మృతి పట్ల జగన్, తెలుగు సీఎంల సంతాపం