Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ నుంచి హోలీ ధమాకా ... 425 రోజుల వ్యాలిడిటీ

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (08:41 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. హోలీ ధమాకా పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్ కాలపరిమితిని 425 రోజులుగా నిర్ణయించింది. వాస్తవానికి ఈ ప్లాన్ వ్యాలిడిటీ 395 రోజులు. కానీ మరో 30 రోజుల పాటు అదనపు కాలపరిమితిని కల్పించింది. 
 
ఈ నెల 14వ తేదీన హోలీ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ఆఫర్ రూ.2,399 ప్లాన్ వర్తిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 2 రోజుల జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్‌లు అందిస్తుంది. 
 
ఈ ప్లాన్ వ్యాలిడిటీని 395 రోజుల నుంచి 425 రోజులకు పెంచింది. అంటే ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా నెల రోజుల అదనపు చెల్లుబాటును అందిస్తుందన్నమాట. ఈ మేరకు హోలీ ధమాకా ఆఫర్ వివరాలను తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments