Webdunia - Bharat's app for daily news and videos

Install App

డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న బోల్ట్

ఐవీఆర్
శనివారం, 24 ఫిబ్రవరి 2024 (19:57 IST)
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వేరబుల్ బ్రాండ్ అనగానే మన అందరికి గుర్తుకువచ్చేది BOULT. ఇప్పటికే ఎన్నో వినూత్నమైన ఉత్పత్తులను లాంచ్ చేసి దేశ యువతను మెప్పించింది BOULT. అయితే దక్షిణాదిలో కూడా తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మార్కెట్‌లకు పంపిణీదారు అయినటువంటి డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా వ్యూహాత్మక రిటైల్ విస్తరణ ప్రణాళికల్లో BOULT సరికొత్త సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది. BOULT యొక్క మార్కెట్‌ను మరింతగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు అయినటువంటి రహిల్, ఇక్బాల్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో BOULT కోసం ప్రత్యేక భాగస్వామిగా డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నియమించబడింది.
 
ఈ సందర్భంగా BOULT సహ వ్యవస్థాపకుడు శ్రీ వరుణ్ గుప్తా మాట్లాడుతూ... "డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోకి మా విస్తరణను మరింతగా పెంచుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ భాగస్వామ్యం కుదిరినందుకు చాలా ఆనందంగా ఉంది. మా ఓమ్నీ-ఛానల్ ఉనికిని మెరుగుపరచడానికి మేము నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాము. మేము గ్లోబల్ మార్కెట్‌లలో ఇప్పటికే ఉన్నాం. అయినప్పటికీ మా ఉనికికి భారతదేశం అంతటా విస్తరించాలనే మా ఆకాంక్షలను ఇది సూచిస్తుంది. ఈ సహకారం ద్వారా దక్షిణ భారతదేశంలోని డైనమిక్ మార్కెట్‌కి మా అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులు అందించడంలో మా ఉమ్మడి నిబద్ధతను నొక్కి చెబుతుంది. డికాజో సొల్యూషన్స్‌కు ఉన్న విస్తృతమైన నెట్వర్క్, వారికున్న అంకితభావం మా ఉత్పత్తులను మరింతగా వినియోగదారులకు చేరువవుతుందని మేం భావిస్తున్నాం అని అన్నారు ఆయన.
 
“2024 కోసం మా లక్ష్యం ఏంటంటే... BOULT ఉత్పత్తులను మా అంతర్జాతీయ రిటైల్ విస్తరణ ప్రణాళికల ద్వారా దేశంలోని ప్రతి మూలకు చేరుకునేలా చేయడం. మా ఈ-కామర్స్ కొనుగోళ్లు ద్వారా 2023లో మేం గణనీయమైన ప్రోత్సాహాన్ని అందుకున్నాం. 2024 మొదటి త్రైమాసికానికి మేం భారతదేశంలో 15% మార్కెట్ వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పుడు డికాజోతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా ఈ లక్ష్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లగలమనే నమ్మకం మాకుంది” అని అన్నారు బౌల్ట్ ఆఫ్‌లైన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ శ్రీ శంతను సింగ్.
 
ఈ సందర్భంగా BOULTతో భాగస్వామ్యం గురించి డికాజో బిజినెస్ డైరెక్టర్ శ్రీ మొహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ... “ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త సాంకేతికతలను అర్థం చేసుకుని మార్కెట్ ఉనికిని మరింతగా విస్తరించుకోవాలనే మా ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంది. అందుకే మేం BOULTతో కలిసి పని చేయడానికి సంతోషిస్తున్నాము. BOULT యొక్క విభిన్నమైన ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మూలకు చేరుకునేలా చూసుకోవాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. BOULT యొక్క అసాధారణమైన ఉత్పత్తులను మా కస్టమర్‌లకు చేరువ చేసే విజయవంతమైన సహకారం కోసం మేము ఎదురుచూస్తున్నాము అని అన్నారు ఆయన.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments