Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ ధరలపై బీజేపీ స్పెషల్ గ్రాఫ్... పడీపడీ నవ్వుకుంటున్న నెటిజన్లు

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై భారతీయ జనతా పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన గ్రాఫ్‌ను చూసి నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు. ఈ గ్రాఫ్‌లో రూ.71.14 కంటే.. రూ.80.73 తక్కువ అని చూపడం

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (14:02 IST)
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై భారతీయ జనతా పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన గ్రాఫ్‌ను చూసి నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు. ఈ గ్రాఫ్‌లో రూ.71.14 కంటే.. రూ.80.73 తక్కువ అని చూపడం గమనార్హం. దీన్ని చూసిన నెటిజన్లు.. అంకెలు రానివాళ్లు దేశాన్ని పాలిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
 
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసలు వెల్లువెత్తుతున్న విషయం తెల్సిందే. విపక్షాలు భారత్ బంద్‌ కూడా పాటించాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన బీజేపీ పెట్రోలు ధరలపై కాంగ్రెస్‌ను ఇరికించాలని ప్రయత్నించి బొక్కబోర్లాపడింది. ఈ మేరకు ట్విట్టర్‌లో 'శాతాల్లో పెట్రోలు పెంపు... ఇదీ వాస్తవం' అంటూ ఓ ఫొటో పోస్టు చేసి అభాసుపాలైంది. భారీగా పెరిగిన పెట్రోలు ధర సూచీని తగ్గించి.. తక్కువ ఉన్న ధరల సూచీని ఎక్కువ చేసి చూపించింది. 
 
పెట్రో ధరల పెంపునకు నిరసనగా విపక్షాలు చేపట్టిన బంద్‌ను నిరసిస్తూ బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో రెండు గ్రాఫ్‌లు పోస్టు చేసింది. వాటిలో ఢిల్లీలో మే 2014లో లీటరు పెట్రోలు ధరను రూ.71.41గా చూపించింది. కానీ ఇప్పుడు మాత్రం రూ.80.73గా ఉన్నట్టు చూపించింది. అక్కడివరకు బాగానే ఉంది కానీ, రూ.80తో పోలిస్తే రూ.70 చాలా ఎక్కువని అర్థం వచ్చేలా రూ.71.41 సూచీని బాగా పెంచేసి, రూ.80.73 సంకేతాన్ని బాగా తగ్గించి చూపించింది. 
 
అంటే రూ.80.73 కంటే 71 రూపాయలే ఎక్కువ అని చెబుతూ బీజేపీ చేసిన పోస్టును చూసిన నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు. అంకెలు రానివాళ్లు దేశాన్ని పాలిస్తున్నారంటూ ఎగతాళి చేస్తున్నారు. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించి బీజేపీనే ఇరుకున పడిందని సెటైర్లు వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments