Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాటా సంస్థ రూ.3లు వసూలు చేద్దామనుకుంటే, రూ. 9,000లు..?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (19:17 IST)
పంజాబ్‌ చండీగఢ్‌కి చెందిన దినేష్ ప్రసాద్ బాటా షోరూంకి వెళ్లి బూట్లు కొనుగోలు చేశారు. వాటి రేటు రూ.402లు, షూస్‌ని పేపర్ బ్యాగ్‌లో పెట్టిస్తూ దాని బ్యాగ్ రేటు రూ.3లు అని బిల్లులో వేశారు. దానికి ఆగ్రహం చెందిన దినేష్ మీ షోరూం ప్రమోషన్ కోసం బాటా లోగో వేసిన ఉన్న బ్యాగ్ ఇస్తూ.. పైపెచ్చు దానికి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అని యాజమాన్యాన్ని నిలదీశాడు. 
 
రూ.3 ఇవ్వనంటూ, బ్యాగ్‌ను ఫ్రీగా ఇవ్వండి అంటూ వాదించాడు. దానికి సదరు యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో కోపంతో దినేష్ వెళ్లి వినియోగదారుల ఫోరమ్‌లో కేసు నమోదు చేశాడు. దినేష్ వాదనను విన్న ఫోరం బాటాకు జరిమానా విధించింది.
 
పేపర్ బ్యాగ్‌కి బలవంతంగా రూ.3లు వసూలు చేయడం సేవలలో లోపమేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. కస్టమర్‌లు ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు పేపర్ బ్యాగ్‌లను ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది. వ్యాజ్యం కింద రూ.1000, మానసిక ఆందోళనకు రూ.3000, లీగల్ ఎయిడ్ నిధికి రూ.5,000లు, కంప్లైంట్ చేయడానికి అయిన ఖర్చు రూ.1000లు చెల్లించమంటూ బాటాని ఆదేశించింది.
 
ప్రతి వినియోగదారునికి క్యారీ బ్యాగ్‌ని ఉచితంగా అందించాలంటూ ఆదేశించింది. చాలా స్టోర్‌లలో క్యారీ బ్యాగ్ పేరుతో రూ.3 నుంచి రూ.5లు వసూలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టానుసారంగా వినియోగదారులను నిలువునా దోచేస్తున్నారు. దినేష్ ప్రసాద్ లాంటి వ్యక్తులు సమాజానికి కొత్త మేల్కొలుపును తీసుకురాగలరని నెటిజన్‌లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments