Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు చక్రాల వాహనాల కోసం నూతన డీలర్‌షిప్ ప్రారంభించిన బజాజ్ ఆటో

ఐవీఆర్
గురువారం, 27 జూన్ 2024 (15:43 IST)
ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్రవాహన, మూడు చక్రాల వాహన కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్, తమ నూతన కార్గో, ప్యాసింజర్ త్రీ వీలర్ ఆటోల కోసం ఈరోజు హైదరాబాద్‌లో తమ సరికొత్త డీలర్‌షిప్‌ను ఉప్పల్ భాగాయత్ వద్ద శ్రీ వినాయక బజాజ్ పేరిట ప్రారంభించింది. ఈ డీలర్‌షిప్‌ను శ్రీ అన్షుల్ చోప్రా ప్రారంభించగా, వర్క్ షాప్‌ను శ్రీ అనుపమ్ శ్రీవాస్తవ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైర్మన్ శ్రీ కె వి బాబుల్ రెడ్డి సహా పలువురు ముఖ్య అతిధులు పాల్గొన్నారు. 
 
ఈ డీలర్‌షిప్ వద్ద బజాజ్ ఆటోల సమగ్ర శ్రేణి అందుబాటులో ఉంటుంది. ఈ నూతన డీలర్షిప్ ప్రారంభం పురస్కరించుకుని ప్రయాణీకుల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ బజాజ్ RE E-Tec 9.0ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అన్షుల్ చొప్రా, అనుపమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ “కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ సహా ప్యాసింజర్, కార్గో ఫార్మాట్‌లలో ఇక్కడ త్రీ వీలర్ వాహనాలను అందించనున్నారు. వినియోగదారులకు మా సేవలను విస్తరించేందుకు తెలంగాణ వ్యాప్తంగా మా డిస్ట్రిబ్యూషన్ సేవలను విస్తరించనున్నాము" అని అన్నారు.
 
శ్రీ వినాయక ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ కెవి బాబుల్ రెడ్డి మాట్లాడుతూ బజాజ్ ఆటో డీలర్‌గా నిలవడం సంతోషంగా ఉందన్నారు, మెరుగైన అమ్మకాలు, అమ్మకం తరువాత సేవలను అందించనున్నాం" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments