Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో ఆటోమొబైల్‌ సేవా ప్రదాత గో మెకానిక్‌ సరికొత్త స్పేర్‌పార్ట్స్‌ ఫ్రాంచైజీ ఔట్‌లెట్‌

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (19:37 IST)
భారతదేశపు అతిపెద్ద సాంకేతిక ఆధారిత బహుళ బ్రాండ్‌ కార్‌ వర్క్‌షాప్స్‌తో కూడిన నెట్‌వర్క్‌ కలిగిన గో మెకానిక్‌ తమ గో మెకానిక్స్‌ స్పేర్స్‌ ఆధీకృత ఫ్రాంచైజీ స్టోర్‌- రిప్పర్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను తెరిచినట్లు ప్రకటించింది. ఇటీవలనే ఆటో విడిభాగాల మార్కెట్‌లోకి తమ నూతన బ్రాండ్‌ గోమెకానిక్‌ స్పేర్స్‌ ద్వారా గో మెకానిక్‌ ప్రవేశించడంతో పాటుగా తమ మొత్తం శ్రేణి మల్టీ బ్రాండ్‌ ఉత్పత్తులను తమ ఫ్రాంచైజీ ఔట్‌లెట్‌ ద్వారా పంపిణీ చేయనుంది. గోమెకానిక్‌ స్పేర్స్‌, మొబిల్‌, గల్ఫ్‌, మోన్రో, బోష్‌,  వాలియో, పురోలేటర్‌, లివ్‌గార్డ్‌, లుమాక్స్‌, లక్‌, ఎన్‌జీకె, సుబ్రొస్‌ మరొయు యూరోప్‌పార్‌ వంటి బ్రాండ్లు ఇక్కడ లభ్యమవుతాయి
 
గో మెకానిక్స్‌ స్పేర్స్‌ ఫ్రాంచైజీని హైదరాబాద్‌లో ప్రారంభించడం ద్వారా, ఈ బ్రాండ్‌ ఇప్పుడు తమ విడిభాగాల వ్యాపారాన్ని టియర్‌ 2, టియర్‌ 3 నగరాలకు విస్తరించడంతో పాటుగా అత్యున్నత నాణ్యత కలిగిన విడిభాగాల సరఫరాలో ఉన్న సమస్యలకు తగిన పరిష్కారం సైతం అందించనుంది. స్థిరమైన్‌ నెట్‌వర్క్‌తో కూడిన 10 సేవా కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటుచేయడం ద్వారా నగరంలో అందుబాటు ధరలో నమ్మకమైన కారు మరమ్మత్తులను అందించనుంది.
 
ఈ బ్రాండ్‌ ఇప్పుడు ప్రస్తుత మరియు భవిష్యత్‌ విడిభాగాల రిటైలర్లు మరియు పంపిణీదారులు మరియు వర్క్‌షాప్‌ యజమానుల అవసరాలను సైతం తీర్చనుంది. ఈ ఫ్రాంచైజీ ఇప్పుడు అగ్రశ్రేణి బ్రాండ్ల అసలైన విడిభాగాలను సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటుగా సుప్రసిద్ధ తయారీదారులు, సరఫరాదారులతో గో మెకానిక్స్‌ యొక్క దేశవ్యాప్త భాగస్వామ్యాలతో అత్యుత్తమ రాయితీలను సైతం అందించనుంది.
 
ఫ్రాంచైజీ స్టోర్‌ ప్రారంభం సందర్భంగా శ్రీ నితిన్‌ రానా, కో-ఫౌండర్‌, గో మెకానిక్‌ మాట్లాడుతూ, ‘‘ఇటీవలి కాలంలో మా ఇతర ఫ్రాంచైజీ ఔట్‌లెట్లకు మేము అందుకున్న స్పందన పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. మాకు సరికొత్త మార్కెట్‌ హైదరాబాద్‌.  కానీ మా పరిశ్రమ అనుభవం, దీని పట్ల ఉన్న అవగాహన వెల్లడించే దాని ప్రకారం హైదరాబాద్‌లో అత్యధిక  సామర్థ్యం ఉంది మరీ ముఖ్యంగా మా తరహా వ్యాపారాలకు ఇది అతి ముఖ్యమైన మార్కెట్‌. వేగవంతమైన, అందుబాటు ధరలలోని పరిష్కారాలను మా వినియోగదారులందరికీ అందించాలన్నది మా లక్ష్యం. లాక్‌డౌన్‌లో కూడా వృద్ధి నమోదు చేయడం ద్వారా మేము మా మార్గం పట్ల సానుకూలంగా ఉన్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments