Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొంచివున్న ఆర్థిక మాంద్యం : 1971 నాటి సమస్యే కారణం!!

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (10:34 IST)
ప్రపంచం ఆర్థిక సమస్యను ఎదుర్కోనుందని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కియోసాకి హెచ్చరించారు. ప్రస్తుతం పెరుగుతున్న సమస్యకు మూలం 1971 నాటిదని ఆయన తెలిపారు. బంగారం, వెండి, బిట్ కాయిన్‌లను ఆదా చేయడం ద్వారా సంక్షోభం నుంచి యటపడొచ్చని కియోసాకి తెలిపారు. ఆయన తాజాగా చేసిన పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. 
 
తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఆర్థిక చరిత్రలో కీలకమైన క్షణాలను ఎత్తి చూపారు. ఈ పెరుగుతున్న సమస్యకు మూలం 1971 నాటిదని ఆయన పేర్కొన్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ యూఎస్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు 1.6 ట్రిలియన్ డాలర్ల విద్యార్థి రుణ మార్కెట్ పతనం వల్ల తదుపరి సంక్షోభం ఏర్పడుతుందనే రికార్డ్స్ అభిప్రాయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
సాంప్రదాయ పొదుపు ఇకపై సురక్షితం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. తాను 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్లుగా ధనికులు డబ్బు కోసం పని చేయరని, పొదుపు చేసేవారు నష్టపోతారన్నారు. బంగారం, వెండి, బిట్ కాయిన్లను ఆదా చేయడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడవచ్చని ఆయన అన్నారు. 2012లో రిచ్ డాడ్ ప్రవచనంలో తాను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైందని, దయచేసి జాగ్రత్తగా ఉండాలని కియోసాకి సూచించారు. ప్రస్తుతం కియోసాకి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments