Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎథర్ ఎనర్జీ ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నంలో...

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (21:18 IST)
ఫేజ్ 2 విస్తరణలో భాగంగా, భారతదేశంలోని మొట్టమొదటి తెలివైన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారుడైన ఎథర్ ఎనర్జీ, విజయవాడలో Ather 450Xని లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రీ ఆర్డర్‌లు, డీలర్‌షిప్ అభ్యర్థనలు. అలానే టెస్ట్ రైడ్‌లకు పెద్ద సంఖ్యలో అభ్యర్థన కారణంగా తమ ఫేజ్ 2 విస్తరణలో ఎథర్ ఎనర్జీ కొత్త మార్కెట్‌ని జోడించింది. కొత్త ప్రొడక్ట్ లైన్ అధికారిక లాంఛ్‌కు ముందు జనవరి 2020లోనే ఆర్డర్‌లు చేయడం వల్ల లిమిటెడ్ ఎడిషన్ సీరిస్ 1 వేహికల్ కొరకు విజయవాడలో చాలామంది అర్హులు. విజయవాడ మరియు విశాఖపట్నంలో లాంఛ్ చేయడంతో, ఎథర్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌లోనికి అధికారికంగా ప్రవేశిస్తోంది.
 
2021 త్రైమాసికం ముగిసేనాటికి, ఎథర్ 450X ఫేజ్ 1లో - బెంగళూరు, చెన్నై, హైద్రాబాద్, కోయంబత్తూరు, కొచ్చి, కోల్‌కతా, అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్‌సిఆర్, ముంబై, పూణే, కోజికోడ్ ఫేజ్ 2లో అదనంగా 16 నగరాలు - మైసూర్, హుబ్లీ, జైపూర్, ఇండోర్, పనాజీ, భువనేశ్వర్, నాసిక్,సూరత్, చంఢీఘడ్, విజయవాడ, విశాఖపట్నం, గౌహతి, నాగపూర్, నోయిడా, లక్నో మరియు సిలిగురిలో ఇలా 27 నగరాల్లో అందుబాటులోకి వస్తుంది. 
 
ఎథర్ ఈ నగరాల్లో Q1 2021లో దశలవారీగా విడుదల చేస్తుంది మరియు వాహనం గురించి ఖాతాదారులు అనుభూతి చెందడానికి టెస్ట్రైడ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రారంభిస్తుంది. ఎథర్ ఈ మార్కెట్లలోని భావిరిటైల్ భాగస్వాముల సహకారంతో వేగవంతమైన ఇ.వి ఛార్జింగ్ నెట్‌వర్క్, ఎథర్ గ్రిడ్‌ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే స్థలాలను గుర్తించడం ప్రారంభించింది. ఎథర్ అందుబాటులో ఉన్న 11 మార్కెట్లలో, ఇప్పటికే 60కి పైగా ఛార్జింగ్ పాయింట్లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి మరియు మరిన్ని త్వరలో రాబోతున్నాయి. 
 
450X తన పాత ఎథర్ 450 నుంచి అప్‌గ్రేడ్ చేయబడింది మరియు ఇది భారతదేవంలో అత్యంత వేగవంతమైన మరియు స్మార్ట్ స్కూటర్‌ల్లో ఒకటి, మరియు ఇది గ్రే, గ్రీన్ మరియు వైట్ కలర్‌లో లభ్యమవుతుంది. 6kW PMSM మోటార్, కొత్త 2.9 kWh లిథియం అయాన్ బ్యాటరీ 4 రైడింగ్ మోడల్స్‌లో స్కూటర్‌ వస్తుంది. ఎకో, రైడ్ మరియు స్పోర్ట్‌కు అదనంగా, ఎథర్ కొత్త అధిక పనితీరు మోడ్, ‘ర్యాప్’ని పరిచయం చేస్తోంది. ఎథర్ 450X ర్యాప్ మోడ్‌లో కేవలం 3.3 సెకండ్లలో 0 నుంచి 40 kmph వేగాన్ని చేరుకుంటుంది. ఇది ఈ కేటగిరీలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా అవతరించింది మరియు సిటీ ట్రాఫిక్‌లో నావిగేట్ చేయడానికి సరైన ఎంపికగా నిలుస్తుంది. ఎథర్ 450X ఇంతకు ముందు నిమిషానికి 1.5km చొప్పున కంటే 50% వేగంగా ఛార్జ్ చేస్తుంది, ఎలక్ట్రిక్ టూ వీల్ కేటగిరీగా దీనిని రూపొందిస్తుంది. 
 
ఎథర్ 450Xలో 4G సిమ్ కార్డు మరియు వైఫై‌తోపాటుగా బ్లూటూత్ కనెక్టివిటిని కూడా కలిగి ఉంది, ఇది టచ్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ మీద ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వడానికి మరియు మ్యూజిక్‌ని నిర్వహించడానికి అనుమతిస్తుంది. కొత్త 7” టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, 16M కలర్ డెప్త్ మరియు స్నాప్‌డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఎథర్ 450X మ్యాప్ నావిగేషన్, ఆన్ బోర్డ్ డయగ్నాస్టిక్స్ మరియు ఓవర్-ద ఎయిర్ అప్‌డేట్‌లు, ఆటో ఇండికేటర్ ఆఫ్ మరియు గైడ్ మీ హోమ్ లైట్‌లు వంటి ఇతర ప్రత్యేక ఫీచర్‌లు అందించడానికి ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్‌ని ఉపయోగించుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments