తమ ఎథర్ 450ఎక్స్ డెలివరీలను నవంబర్ 2020లో ప్రారంభిస్తామని చేసిన ప్రకటనకనుగుణంగా, ఎథర్ ఎనర్జీ ఇప్పుడు తమ వేగవంతమైన చార్జింగ్ ప్రాంగణాల నెట్‌వర్క్, ద ఎథర్ గ్రిడ్‌ను హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయడం ప్రారంభించింది. నగరంలోని అత్యంత కీలక ప్రాంతాలైనటువంటి శరత్ సిటీ మాల్, ఆల్మండ్ హౌస్, తాజ్ మహల్ హోటల్, స్విస్ కాస్లే, ఫ్లిప్ సైడ్, నోమా టాకీస్ మరియు మూన్‌షైన్ ప్రాజెక్ట్ తదితర 11 ప్రదేశాలలో ఇప్పటికే చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది.
మొదటి దశలో భాగంగా, 5 నుంచి 10 వేగవంతమైన చార్జింగ్ పాయింట్లను ఈ సంవత్సరాంతానికి ఏర్పాటు చేయనున్నారు. ఎథర్ ఎనర్జీ, ఇప్పుడు ఇదే తరహా ప్రోగ్రెసివ్ అతిథులు అయినటువంటి కేఫ్‌లు, రెస్టారెంట్లు, టెక్‌పార్కులు, మాల్స్, జిమ్‌లతో భాగస్వామ్యం చేసుకుని ఈవీ యజమానులకు అతి సులభమైన ప్రాప్యతను అందిస్తూ హైదరబాద్ నగరంలో విద్యుత్ వాహనాల స్వీకరణను సులభతరం చేస్తుంది.
బెంగళూరు, చెన్నై నగరాల తరువాత ఎథర్ ఎనర్జీ యొక్క వేగవంతమైన చార్జింగ్ పబ్లిక్ నెట్‌వర్క్‌ను కలిగిన నగరం హైదరాబాద్. ఎథర్ గ్రిడ్ పాయింట్లను అన్ని విద్యుత్ ద్విచక్రవాహనాలూ, విద్యుత్ నాలుగు చక్ర వాహనాలూ వినియోగించుకోవచ్చు. ఈ సదుపాయాలను 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఎథర్ గ్రిడ్ ఏర్పాట్లు ఇప్పటికే ఇతర నగరాలైనటువంటి పూనె, అహ్మదాబాద్‌లలో ప్రారంభమయ్యాయి. అనంతర కాలంలో ఢిల్లీ, ముంబై, కొచి, కోల్‌కతా, కొజికోడ్, కోయంబత్తూరులలో సైతం ప్రారంభం కానున్నాయి.
చార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటుతో, ఎథర్ ఎనర్జీ అధికారికంగా హైదరాబాద్ మార్కెట్‌లో ప్రవేశించినట్లయింది. ఎథర్ గ్రిడ్ అనుసరించి, ఈ నగరంలో త్వరలోనే ఎక్స్‌పీరియన్స్ కేంద్రం- ఎథర్ స్పేస్‌ను సైతం త్వరలోనే ఏర్పాటుచేయనున్నారు. ఈ మధ్యకాలంలో వినియోగదారులు ఎథర్ 450 ఎక్స్‌ను వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు మరియు నవంబర్ 2020 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.
ఈ చార్జింగ్ నెట్‌వర్క్‌కు ఎథర్ గ్రిడ్ యాప్ మద్దతునందిస్తుంది. ఇది ఈవీ యజమానులు చార్జింగ్ పాయింట్లను గుర్తించడంతో పాటుగా వాస్తవ సమయంలో దగ్గరలోని చార్జింగ్ స్టేషన్‌ల వద్ద లభ్యతను కూడా తెలుపుతుంది. ఎథర్ ఎనర్జీ వేగవంతమైన తమ విస్తరణ దశలో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి 2021 నాటికి 150 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటుచేయనుంది.
ఈ సందర్భంగా రవ్‌నీత్ ఫోఖెలా, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మాట్లాడుతూ... బెంగళూరు, చెన్నై నగరాలలో ఎథర్ గ్రిడ్‌ను స్థిరంగా స్వీకరించడం చూశాము మరియు ఏదైనా మార్కెట్‌లో మా ఉత్పత్తులను ఆవిష్కరించక మునుపు మరియు మార్కెట్‌లో ప్రవేశించడానికి ముందుగానే అందుబాటులో చార్జింగ్ మౌలిక వసతులు తీసుకురావడం ముఖ్యమని మేము నమ్ముతున్నాం.
తెలంగాణా ప్రభుత్వం యొక్క నూతన ఈవీ విధానంలో ఎలాంటి రహదారి పన్నులు మరియు రిజిస్ట్రేషన్ ఫీజులూ వసూలు చేయడం లేదు మరియు ఇది పబ్లిక్ చార్జింగ్ మౌలిక వసతులకు సైతం మద్దతునందిస్తుంది. దీనివల్ల ఇక్కడ ఈవీలకు డిమాండ్ వృద్ధి చెందనుంది.
సాంకేతికత స్వీకరణ పరంగా హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది మరియు ఈవీలకు నగరంలో ఉన్న డిమాండ్ దానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఎథర్ గ్రిడ్ నెట్‌వర్క్ ఇప్పుడు నగరంలోని ఈవీ యజమానుల నడుమ ఆందోళన తగ్గించడంతో పాటుగా వారి యాజమాన్య అనుభవాలను సైతం వృద్ధి చేయనుంది. మేమిప్పటికే బహుళ భాగస్వాములతో ఒప్పందం చేసుకున్నాం మరియు రాబోయే సంవత్సరాలలో మరింత మందితో ఈ అనుబంధం కొనసాగించనున్నాం అని అన్నారు.