Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల ద్వారా వచ్చిన వార్షిక మొత్తం రూ.123,727 మిలియన్లు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (22:06 IST)
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల ద్వారా వచ్చిన వార్షిక మొత్తం రూ.123,727 మిలియన్లు (123.73 బిలియన్లు)గా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ మొత్తం 2021 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 52,433 మిలియన్ల నుం చి 136% పెరిగింది. తెలంగాణ రాష్ట్రం అత్యధిక వార్షిక వృద్ధి సాధించేందుకు ఇది కూడా దోహదం చేసింది. దేశంలో ఎస్ డి అండ్ ఆర్సీ ఆదాయపరంగా చూస్తే అత్యధిక ఆదాయం పొందుతున్న 5వ రాష్ట్రం ఇదే.

 
2022 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సగటు నెలవారీ ఆదాయం రూ.10310  మిలియన్లుగా ఉండింది. 2021 ఆర్థిక సంవత్సరంలో అది రూ.4369 మిలియన్లుగా ఉండింది. దేశపు మొత్తం రెవెన్యూ వసూళ్లకు తెలం గాణ వంతు 7%గా ఉంది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకారం, 27 రాష్ట్రాలు, ఒక యూటీ (జమ్మూ అండ్ క శ్మీర్) నుంచి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల సంకలిత రెవెన్యూ వసూళ్లు 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.17,11,502 మిలియన్లు/ రూ.1,711 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇది 2021 ఆర్థిక సంవత్సరం నాటి రూ.12,77,548 మిలియన్లతో పోలిస్తే 34% వృద్ధి చెందింది. సగటు నెలవారీ రెవెన్యూ వసూళ్లు 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.1,06,462 మిలియన్లుగా ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,42,625 మిలియన్లుగా ఉన్నాయి.

 
నికర రెవెన్యూ గణాంకాల పరంగా చూస్తే దేశంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల వసూళ్లలో రూ. 3,55,937 మిలియన్లతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. దేశం మొత్తం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చా ర్జీల వసూళ్లలో దీని వాటా 21%గా ఉంది. రూ. 2,00,483 మిలియన్లతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. దేశం మొత్తం మీద ఈ వసూళ్లలో దీ ని వాటా 12% గా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, రూ.1,64,752 మిలియన్ల నుంచి ఆదాయంలో 22% వృద్ధిని సాధించింది.

 
రూ.1,43,310 మిలియన్లతో తమిళనాడు మూడోస్థానంలో నిలిచింది. దేశం మొత్తంలో ఈ ఆదాయంలో దీని వాటా 8%గా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.1,16,751 మిలియన్లుగా ఉండగా, అది 2022 ఆర్థిక సంవత్సరంలో 23% వృద్ధి చెందింది. కర్నాటక, తెలంగాణ లు వరుసగా రూ.1,40,197 మిలియన్లు, రూ.1,23,727 మిలియన్లతో ఈ పట్టికలో 4, 5 స్థానాలు పొందాయి. ఏటేటా ప్రాతిపదికన సాధించిన వృద్ధితో చూస్తే, తెలంగాణ దేశంలోనే అత్యధికంగా 136% వృద్ధిని సాధించిం ది. జమ్మూ కశ్మీర్ 88%, సిక్కిం 78%, నాగాలాండ్ 51%, హర్యానా 47%, గుజరాత్ 41% సాధించాయి. తెలంగాణ, జమ్మూ కశ్మీర్, సిక్కిం, నాగాలాండ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర....ఈ ఏడు రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల వసూళ్లలో 40 శాతానికి మించి వృద్ధిని నమోదు చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments