Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona pandemic: ఏపీ బ్యాంకులు ఇక రోజుకు 4 గంటలే పనిచేస్తాయ్!

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (22:56 IST)
బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్న వేళ.. బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకర్ల సమితి కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఏపీలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి (ఏప్రిల్ 23,2021) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మే 15 వరకు ఈ రూల్స్ కొనసాగుతాయి. పరిమిత సిబ్బందితో బ్యాంకులు చేయాలని, పలువురు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తున్నట్టుగా బ్యాంకర్ల సమితి తెలిపింది.
 
కాగా, కరోనా రెండో వేవ్‌లో తెలంగాణలో 600 మంది ఎస్బీఐ ఉద్యోగులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కోవిడ్‌ బారిన పడుతున్నారని ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్‌ 30వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments