Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ నుంచి ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్: రూ.499 వార్షిక చందాతో పలు రకాల సేవలు!

వినియోగదారుల కోసం ''ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌''ను అమేజాన్ సంస్థ ప్రకటించింది. ఈ-కామెర్స్‌లో అగ్రగామి అయిన అమేజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా రూ. 499 వార్షిక చందాతో చేరితే పలు రకాల సేవలన

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (16:12 IST)
వినియోగదారుల కోసం ''ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌''ను అమేజాన్ సంస్థ ప్రకటించింది. ఈ-కామెర్స్‌లో అగ్రగామి అయిన అమేజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా రూ. 499 వార్షిక చందాతో చేరితే పలు రకాల సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. వందకు పైగా దేశాల్లో ఈ-కామెర్స్‌లో రాణిస్తున్న అమేజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్ చందాదారులకు స్పెషల్ డీల్స్‌తో పాటు రెండు నుంచి మూడు రోజుల్లోనే కోరుకున్న ప్రాడెక్టులను అందిస్తామని, కనీస కొనుగోలు నిబంధనలు ఉండవని ప్రకటించింది. 
 
ఇంకా 60 రోజుల ప్రారంభ ఉచిత ఆఫర్లు, రూ. 500 డిస్కౌంట్ ఇస్తామని అమేజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు. ఇంకా అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా అమేజాన్ వినియోగదారులకు అన్ లిమిటెడ్ ఫ్రీ సర్వీసులతో పాటు ప్రైమ్ డెలివరీని అందుబాటులో తీసుకొస్తామని ప్రకటించారు. వినియోగదారుల సౌకర్యార్థం పలు స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. 
 
ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా చందాదారులుగా మారిన, సభ్యత్వం పొందిన ప్రధాన సభ్యులకు 20 నగరాల్లో పదివేలకు పైగా ఉత్పత్తులపై రూ.50పైగా రాయితీతో పాటు కోరిన రోజే డెలివరీ అందుకునే సౌలభ్యం ఉంటుందని అమిత్ అగర్వాల్ వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments