Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5లకే అమేజాన్‌లో బంగారం కొనవచ్చు.. ఎలాగంటే?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (21:46 IST)
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. అమేజాన్ యాప్ ద్వారా ఐదు రూపాయలకే బంగారం కొనవచ్చు. ఆశ్చర్యపోతున్నారా? ఐతే చదవండి. గోల్డ్ వాల్ట్ పేరుతో అమేజాన్ పే తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు కేవలం ఐదు రూపాయలకే డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేయవచ్చు. అంటే భౌతికంగా బంగారం చేతికిరాదు కానీ మనం వెచ్చించదగిన సొమ్ముకు సరిపడా బంగారంపై పెట్టుబడి పెట్టుకోవచ్చు. 
 
ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే, మొబిక్విక్‌లలో డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసే సౌకర్యం ఉంది. అయితే, అమేజాన్ పే కొత్త ఫీచర్ ద్వారా కొనుగోలు చేసే బంగారం 99.5 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుందని, అది 24 క్యారెట్ బంగారం అని అమేజాన్ పే వెల్లడించింది.
 
ఈ విధంగా వీలు పడినప్పుడల్లా చిన్న మొత్తాల్లో బంగారాన్ని డిజిటల్ రూపంలో కొనుగోలు చేస్తూ అవసరం అనుకున్నప్పుడు దాన్ని ఒకేసారి అమ్ముకునే వెసులుబాటు వుంటుంది. లేదంటే మనం జమ చేసిన సొమ్ముకు సరిపడా బంగారాన్ని కైవసం చేసుకునే వీలుంటుంది. 
 
చిన్నమొత్తాల్లో బంగారాన్ని డిజిటల్ రూపంలో కొనడం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం జమవుతుంది. ఒకేసారి పెద్దమొత్తంలో బంగారం కొనలేని వారికి ఈ సౌకర్యం ప్రయోజనకరంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments