Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్ తోడ్పాటుతో సేవలందించనున్న లక్షకు పైగా స్థానిక షాపులు, కిరాణా దుకాణాలు

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (15:44 IST)
ఈ పండుగ సీజన్‌లో, భారతదేశ వ్యాప్తంగా ఒక లక్షకు పైగా అమెజాన్‌ తోడ్పాటు కలిగిన  స్థానిక షాప్‌లు, కిరాణా దుకాణాలు, చుట్టుపక్కల స్టోర్లు తమ వినియోగదారులకు సేవలనందించడంతో పాటుగా వారితో పాటుగా వేడుకచేసుకోనున్నారని వెల్లడించింది. లోకల్‌ షాప్స్‌ ఆన్‌ అమెజాన్‌ కార్యక్రమం నుంచి 20వేలకు పైగా ఆఫ్‌లైన్‌ రిటైలర్లు, కిరాణాలు, లోకల్‌షాప్స్‌ మొట్టమొదటిసారిగా గ్రేట్‌ ఇండియన్‌ అమెజాన్‌ పైన పాల్గొనడంతో పాటుగా తమ నగరంతో పాటుగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు సేవలను అందించనున్నారు.
 
నిత్యావసర సరుకులు మొదలు భారీ గృహోపకరణాల వరకూ, హోమ్‌ డెకార్‌ వస్తువులు మొదలు బహుమతులు, తాజా పూల వరకూ అన్నీ ఇక్కడ విక్రయించనున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించింది. ప్రారంభించిన ఐదు నెలల్లోనే ఇది ఘనవిజయం సాధించడంతో పాటుగా భారతదేశంలోని టాప్‌ 10 నగరాల నుంచి 40%మందికి పైగా అమ్మకందారులు ఈ వేదికపై ఉన్నారు.
 
లోకల్‌ షాప్స్‌ ఆన్‌ అమెజాన్‌ కార్యక్రమ విజయం, భారతదేశ వ్యాప్తంగా విస్తృతశ్రేణిలోని చుట్టుపక్కల స్టోర్ల పట్ల అమెజాన్‌ ఇండియా యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించడంతో పాటుగా అమెజాన్‌ ఈజీ, ఐహ్యావ్‌ స్పేస్‌, అమెజాన్‌ పే స్మార్ట్‌ స్టోర్స్‌ వంటి కార్యక్రమాల ద్వారా వారి కార్యకలాపాలలో ఈ-కామర్స్‌ను జోడిస్తుంది.
 
మనీష్‌ తివారీ, వీపీ- అమెజాన్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘ఈ పండుగ సీజన్‌లో మేము మా అమ్మకందారులు, ఎంఎస్‌ఎంఈ భాగస్వాములు వృద్ధి చెందేందుకు సహాయపడటంపై దృష్టి కేంద్రీకరించాము. అదే రీతిలో ఇటీవలి సవాళ్ల నుంచి వారు తిరిగి కోలుకునేందుకు సహాయపడుతున్నాం. గత కొద్ది నెలలుగా మేము అన్ని పరిమాణాల వ్యాపారాలూ తమ వ్యాపారంలో సాంకేతికతను స్వీకరించడాన్ని చూస్తున్నాం.
 
అమెజాన్‌ కార్యక్రమాలలో ఒక లక్షకు పైగా చుటుపక్కల స్టోర్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు జోడించడం ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు తోడ్పడుతున్నాం. అంతేకాకుండా, వారికి సరైన సమయంలో డెలివరీలు అందిస్తూనే, కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులకు అవకాశమూ అందిస్తున్నాం. భారతీయ వ్యాపారుల యొక్క ఆవిష్కరణ మరియు స్వీకరణకు ప్రతీకగా ఇది నిలుస్తుంది. ఈ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ వారికి వృద్ధి మరియు విజయాన్నీ తీసుకురావడంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా లక్షలాది వినియోగదారులకు సేవ చేసే అవకాశమూ అందిస్తుంది’’ అని అన్నారు.
 
లోకల్‌ షాప్స్‌ ఆన్‌ అమెజాన్‌ అనేది నూతన కార్యక్రమం. దీనిని ఈ సంవత్సర ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఇది ఆఫ్‌లైన్‌ రిటైలర్లు, కిరాణాలు మరియు లోకల్‌ షాప్స్‌ ఆన్‌లైన్‌లో తీసుకువచ్చేందుకు తోడ్పడుతుంది. కార్యక్రమం ప్రారంభించిన ఐదు నెలల్లోనే వేగంగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు 20వేలకు పైగా రిటైలర్లు 400 నగరాలలో ఉన్నారు. నేడు, మీరట్‌ మొదలు లుథియానా; సహరాన్‌పూర్‌ మొదలు సూరత్‌ వరకూ, ఇండోర్‌ మొదలు ఎర్నాకుళం మరియు కాంచీపురం వరకూ వేలాది మంది ఆఫ్‌లైన్‌ రిటైలర్లు లోకల్‌ షాప్స్‌ ఆన్‌ అమెజాన్‌ కార్యక్రమంపై భాగంగా ఉన్నారు.
 
అమెజాన్‌పై ఈ లోకల్‌ షాప్స్‌ విస్తృతశ్రేణిలో ఉత్పత్తులు అయినటువంటి తాజా పూలు, హోమ్‌, కిచెన్‌ ఉత్పత్తులు, ఫర్నిచర్‌, ఎలకా్ట్రనిక్స్‌, బుక్స్‌ మరియు టాయ్స్‌ తదితరాలు విక్రయిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో అమెజాన్‌ డాట్‌ ఇన్‌ వినియోగదారులు తమ నగరాల్లోని తమ అభిమాన స్థానిక స్టోర్ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, అదే రోజు/తరువాత రోజు డెలివరీలను తీసుకోవడంతో పాటుగా ఈ స్టోర్లు అందించే విలువ ఆధారిత సేవలనూ పొందవచ్చు.
 
అమెజాన్‌ ఈజీ, ఈ-కామర్స్‌కు తొలిసారి వచ్చిన వినియోగదారులకు సహాయపడే రీతిలో ఉంటుంది. వినియోగదారులు అమెజాన్‌ డాట్‌ ఇన్‌పై ఆర్డర్లను మార్గనిర్ధేశక సహాయకత్వంతో అందించడంతో పాటుగా స్టోర్ల నుంచి లేదా తమ ఇంటి ముంగిటనే తమ ఆర్డర్‌ను డెలివరీ పొందవచ్చు. ఆధునీకరించిన అమెజాన్‌ ఈజీ స్టోర్లు ఫార్మాట్‌ ఇటీవలనే టచ్‌ అండ్‌ ఫీల్‌ ఉత్పత్తి అనుభవాలను  అందిస్తుంది. ఇది బహుళ అమెజాన్‌ సేవలను సింగిల్‌ టచ్‌ పాయింట్‌తో అందిస్తుంది.  ఈ తరహా మొట్టమొదటి స్టోర్‌ను బెంగళూరులో నిర్వహిస్తున్నారు. ఈ అప్‌గ్రేడెడ్‌ ఫార్మాట్‌ స్టోర్లను త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.
 
అమెజాన్‌ పే స్మార్ట్‌ స్టోర్‌, ప్రస్తుతం 15వేలకు పైగా చుట్టుపక్కల ప్రాంతాల స్టోర్లను కాంటాక్ట్‌లెస్‌ షాపింగ్‌ అనుభవాలను అందించేలా తీర్చిదిద్దింది. అమెజాన్‌ పే స్మార్ట్‌ స్టోర్‌తో వినియోగదారులు అతి సులభంగా స్టోర్‌ యొక్క క్యుఆర్‌ కోడ్‌ను అమెజాన్‌ యాప్‌ వినియోగించి స్కాన్‌ చేయడంతో పాటుగా స్టోర్‌లో లభ్యమయ్యే ఉత్పత్తులను అన్వేషించవచ్చు.ఒకసారి ఉత్పత్తులను ఎంపిక చేసుకున్న తరువాత, తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో పాటుగా అమెజాన్‌ పేతో చెక్‌ ఔట్‌ చేయవచ్చు. ఇది యుపీఐ , బ్యాలెన్స్‌ లేదా క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులు వినియోగించి చెల్లించే అవకాశం అందిస్తుంది. వినియోగదారులు అదే సమయంలో ఈ లావాదేవీలను ఈఎంఐలగా మార్చడంతో పాటుగా తమ బ్యాంక్‌లు లేదా అమెజాన్‌ పే ద్వారా ఉత్సాహపూరితమైన బహుమతులను సైతం పొందవచ్చు.
 
అమెజాన్‌ ఐ హ్యావ్‌ స్పేస్‌
రాబోతున్న పండుగ సీజన్‌ పురస్కరించుకుని, అమెజాన్‌ తమ ప్రతిష్టాత్మక ఐ హ్యావ్‌ స్పేస్‌ (ఐహెచ్‌ఎస్‌)డెలివరీ కార్యక్రమాన్ని బలోపేతం చేసింది. ఇప్పుడు దీనిపై 28వేలకు పైగా చుట్టుపక్కల మరియు కిరాణా స్టోర్లు దాదాపు 350 నగరాల్లో ఉన్నాయి. ఈ ఐ హ్యావ్‌ స్పేస్‌ కార్యక్రమం కింద అమెజాన్‌ ఇండయా, తమ స్ధానిక స్టోర్ల యజమానులతో భాగస్వామ్యం చేసుకుని ఉత్పత్తులను 2 నుంచి 4 కిలోమీటర్ల రేడియస్‌లో డెలివరీ చేయిస్తుంది. తద్వారా ఈ స్టోర్ల యజమానులు అదనపు ఆదాయం పొందడంతో పాటుగా తమ స్టోర్లలో మరింత మంది సందర్శకులు పొందేందుకు వీలు కల్పిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments