బ్యాంకు ఖాతా బ్లాక్ చేసినట్టు ఎస్.బి.ఐ నుంచి మెసేజ్ వచ్చిందా...?

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (19:49 IST)
ఇటీవలి సైబర్ నేరగాళ్లు వివిధ రకాల పద్ధతుల్లో చెలరేగిపోతున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పలు బ్యాంకు ఖాతాల్లో ఊడ్చేస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో "మీ బ్యాంకు ఖాతా బ్లాక్ చేయడం జరిగింది" అనే మెసేజ్‌ భారతీయ స్టేట్ బ్యాంకు పంపిస్తున్నట్టుగా ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. ఆ మెసేజ్‌లను చూసి కొందరు నిజమే అనుకుని సైబర్ నేరగాళ్ళు ఇచ్చిన ఫిషింగ్ లింక్స్‌పై క్లిక్ చేసి వాళు అడిగిన వివరాలు ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోతున్నారు. 
 
అయితే, ఎస్.బి.ఐ నుంచి అలాంటి సందేశాలు ఖాతాదారులకు రాదంటూ ప్రభుత్వ రంగ వార్తా సంస్థ పీటీఐ ఓ ట్వీట్‌లో స్పష్టం చేసింది. ఒకవేళ అటువంటి మెసేజ్ వస్తే దానికి సంబంధించి ఎస్.బి.ఐకు ఫిర్యాదు చేయాలని కోరింది. ఒకవేళ అలాంటి మెసేజ్‌లు పదేపదే వచ్చినా వాటికి రిప్లై ఇవ్వొద్దని సూచన చేసింది. 
 
ఈ విషయంలో బ్యాంకు ఖాతాదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. అలాగే, తాము ఎపుడు కూడా ఇటువంటి మెసేజ్‌లు పంపించమని, ఏటీఎం కార్డు వివరాలు అడగమని కస్టమర్లకు చెబుతున్నప్పటికీ కొందరు కస్టమర్లు సైబర్ నేరగాళ్ళ ట్రాప్‌లో పడిపోతున్నారని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments