Publish Date: Sat, 10 Jul 2021 (11:57 IST)
Updated Date: Sat, 10 Jul 2021 (12:08 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు చెందిన కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా వినియోగదారులకు వెల్లడించింది. అంతర్గత నిర్వహణ చర్యల్లో భాగంగా పలు సర్వీసులకు అంతరాయం కలుగనుందని ఎస్బీఐ తెలిపింది. కస్టమర్ల అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది.
ఆ ప్రకారంగా జూలై 10వ తేదీన 22.45 గంటల నుంచి జూలై 11న 00.15 గంటల వరకు ఎస్బీఐ ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవు. అంటే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పనిచేయవు.
అలాగే ఎస్బీఐ తమ కస్టమర్లను మరో విషయంలో అలర్ట్ చేసింది. కస్టమర్లు ఆన్‌లైన్ అకౌంట్ల పాస్వర్డ్లను తరచూ మార్చుకుంటూ ఉండాలని సూచించింది. అప్పుడే మోసాల బారినపడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని… ఈ విషయాన్ని కస్టమర్లు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించింది.