Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపారులకు ఆజియో నుంచి అద్భుతమైన అవకాశం; 19 వరకు 'సంబంధం- 2020' ఆన్‌లైన్ ట్రేడ్ షో

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:35 IST)
రిలయన్స్ రిటైల్‌కు చెందిన ఫ్యాషన్ వేర్ ప్లాట్‌ఫామ్ ఆజియో 'సంబంధం- 2020' పేరుతో ఆన్‌లైన్ ట్రేడ్ షో నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న రీటైలర్లను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ప్రస్తతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రయాణాలు ఎక్కువగా చేసే పరిస్థితి లేదు. అలాగని వ్యాపారాలును ఆపే పరిస్థితి కూడా లేదు.
 
అందుకే వ్యాపారులు తమ కావాల్సిన దుస్తుల్ని కొనేందుకు 'సంబంధం డిజిటల్ ఫెస్టివల్ 2020' వర్చువల్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ మెగా ట్రేడ్ షో 2020 సెప్టెంబర్ 17న ప్రారంభమైంది. సెప్టెంబర్ 19న ముగుస్తుంది. ఈ ట్రేడ్ షోలో రాబోయే ఫెస్టివల్ సీజన్‌కు కావాల్సిన దుస్తులను కొనొచ్చు.
 
దుస్తులతో పాటు ఆఫీసులు, ఇళ్లకు కావాల్సిన లగ్జరీ, సేఫ్టీ ప్రొడక్ట్స్ కూడా కొనొచ్చు. ఈ ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన 70,000+ పైగా రీటైలర్లు పాల్గొంటారని అంచనా. ఆజియో 'సంబంధం- 2020' ఆన్‌లైన్ ట్రేడ్ షోలో 1,300 పైగా బ్రాండ్లకు చెందిన లక్షలాది స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఫెస్టీవ్ కలెక్షన్ రూపొందించారు. 50 పైగా ఫెస్టీవ్ వేర్ బ్రాండ్స్ సరసమైన ధరలకే దుస్తుల్ని, వస్తువులను అమ్ముతున్నాయి. లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్‌కి తగ్గట్టుగా అప్‌డేట్ చేసిన ప్రొడక్ట్స్ కొనొచ్చు.
 
ఇందుకోసం వ్యాపారులు చేయాల్సిందల్లా ఆన్‌లైన్ ట్రేడ్ షోకు రిజిస్టర్ చేసుకోవడమే. ఇందుకోసం register.ajiosambandam.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత డిజిటల్ కేటలాగ్ ఉపయోగించిన ఆర్డర్స్ చేయొచ్చు. బ్రౌజ్ చేయడంతో పాటు వీడియోస్ చూసి తమ కు నచ్చినవాటిని విష్ లిస్ట్‌లో యాడ్ చేయొచ్చు. క్యాష్‌బ్యాక్ లాంటి ఆకర్షణీయమైన ఆఫర్స్ కూడా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments