Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు ట్రాయ్ షాక్... ఉచిత కాలింగ్ ఆఫ‌ర్ మ‌ర్మం ఏంటి? ఎలా ఇస్తున్నారు...?

సెల్ ఫోన్ మార్కెట్లోకి రాకెట్లా దూసుకొచ్చిన జియోకు ఇపుడు ట్రాయ్ షాక్ ఇస్తోంది. ఉచిత కాలింగ్ ఆఫ‌ర్ మ‌ర్మం ఏమిట‌ని నిల‌దీస్తోంది. ఉచిత వాయిస్ కాల్ ఆఫర్లపై వివరణ ఇవ్వాల్సిందేనని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు నోటీసిచ్చినట్లు వార్

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (12:18 IST)
సెల్ ఫోన్ మార్కెట్లోకి రాకెట్లా దూసుకొచ్చిన జియోకు ఇపుడు ట్రాయ్ షాక్ ఇస్తోంది. ఉచిత కాలింగ్ ఆఫ‌ర్ మ‌ర్మం ఏమిట‌ని నిల‌దీస్తోంది. ఉచిత వాయిస్ కాల్ ఆఫర్లపై వివరణ ఇవ్వాల్సిందేనని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు నోటీసిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రెగ్యులేటరీకి సమర్పించిన నివేదికలో వాయిస్ టారిఫ్ ప్లాన్ నిమిషానికి 1.20 పైసలుండగా.. ఉచిత కాలింగ్ ఆఫర్‌ను ఎలా అందిస్తున్నారో తెలుపాల్సిందేనని ట్రాయ్ ఆదేశించినట్టు తెలుస్తోంది. 
 
ఈ రెండింటికీ చాలా తేడా ఉంద‌ని, దీనిపై వివరణ కావాలంటూ ట్రాయ్ కోరినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంపై సీనియర్ ట్రాయ్ అధికారులు, రిలయన్స్ జియో ఎగ్జిక్యూటివ్‌లతో భేటీ అయినట్టు తెలిపాయి. కంపెనీ అందించే టారిఫ్ ప్లాన్ వివరాలు కోరినట్టు, ఈ విషయంపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నట్టు చెప్పాయి.
 
కాల్ ప్లాన్ కింద రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సెకనుకు 2 పైసలు చార్జ్ చేస్తామని రిలయన్స్ జియో తెలిపింది. అంటే నిమిషానికి 1.20 పైసలన్నమాట. సిమ్ కార్డ్ బ్రోచర్స్ పైనే కూడా కస్టమర్లకు ఇదే కనిపిస్తుంది. అయితే ఉచిత కాల్స్ ప్రకటనకు, రెగ్యులేటరీ సమర్పణకు టారిఫ్ ప్లాన్స్‌లో తేడాపై రిలయన్స్ జియో స్పందించడంలేదు. దీనిపై కంపెనీ దగ్గర ఎలాంటి సమాధానం లేదని పలు టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. 
 
ఈ సమస్యను అధిగమించేందుకు 2004లో టెలికాం రెగ్యులేటరీ తయారుచేసిన టెలికాం టారిఫ్ ప్లాన్‌ను సైతం రిలయన్స్ జియో సవరించనుందని తెలుస్తోంది. ఈ టారిఫ్ ఫ్లాన్ ప్రకారం టెలికాం కంపెనీలు ఇంటర్ కనెక్ట్ యూజర్ చార్జీల(ఐయూసీ) కంటే తక్కువగా టారిఫ్‌లు ఉండటానికి ఇష్టపడవు. ప్రస్తుతం ఐయూసీ రేట్ నిమిషానికి 14 పైసలుగా ఉంది. ఉచిత వాయిస్ కాల్స్ ఆఫర్స్‌తో రిలయన్స్ జియో దోపిడీ పద్ధతులకు తెరతీసిందని ఇతర టెలికాం కంపెనీలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. దీనిపై ఫైన‌ల్‌గా ట్రాయ్ ఎలా స్పందిస్తోంద‌నేది మార్కెట్ వ‌ర్గాల ఉత్కంఠ‌గా మారింది.

వెబ్ దునియా తెలుగు వార్తలు, మరిన్ని విశేషాలు పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments