Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దెబ్బ... ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్స్... రూ.145కే అపరిమిత వాయిస్ కాల్స్

రిలయన్స్ జియో దెబ్బకు భారతి ఎయిర్ టెల్ మెల్లమెల్లగా మెట్లు దిగుతోంది. జీవితకాలం ఉచిత వాయిస్ కాల్స్ కూడదంటూ వాదించిన ఎయిర్ టెల్ మెల్లిగా తన గొంతును సవరించుకుంటోంది. తాజాగా అది ప్రకటించిన ఆఫర్లు చూస్తే... రూ. 145 ప్యాక్‌తో 4జి డేటాతోపాటు ఉచిత లోకల్ మరి

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (16:20 IST)
రిలయన్స్ జియో దెబ్బకు భారతి ఎయిర్ టెల్ మెల్లమెల్లగా మెట్లు దిగుతోంది. జీవితకాలం ఉచిత వాయిస్ కాల్స్ కూడదంటూ వాదించిన ఎయిర్ టెల్ మెల్లిగా తన గొంతును సవరించుకుంటోంది. తాజాగా అది ప్రకటించిన ఆఫర్లు చూస్తే... రూ. 145 ప్యాక్‌తో 4జి డేటాతోపాటు ఉచిత లోకల్ మరియు ఎస్టీడి కాల్స్ అపరిమితం అని ప్రకటించింది. ఐతే 145 ప్యాకులో ఓ ట్విస్ట్ ఉంది. అదేమిటంటే... ఈ వాయిస్ కాల్స్ ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ మాత్రమే. ఇతర నెట్వర్కులకు మాట్లాడుకోవాలంటే రూ. 345 ప్యాక్ వేసుకోవాలి. 
 
ఈ ప్యాక్ ద్వారా ఇతర నెట్వర్కులకు అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ఈ రెండు ప్యాక్స్ పరిధి 28 రోజుల వరకు మాత్రమే. ఈ సౌకర్యం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కాగా రిలయన్స్ జియో ఉచిత వాయిస్ కాల్స్ ప్రకటనతో దేశంలో ఒక్కసారిగా ఆ నెట్వర్కుకు 5 కోట్లమంది వినియోగదారులుగా మారిపోయారు. ఇటీవలే కొత్త సంవత్సరం సందర్భంగా గడువును మరో మూడు నెలలు... అంటే మార్చి 31 వరకూ పెంచడంతో ఇతర నెట్వర్కులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహారాష్ట్రలో బైలింగ్వల్ యాక్షన్ డ్రామా డకాయిట్ షూటింగ్

యువత ఆలోచనల నేపథ్యం లో తకిట తధిమి తందాన -రివ్యూ

థ్రిల్లర్‌, సందేశాన్ని, అవగాహనను కల్పించేలా సుడల్ సీజన్ 2

Naveen Polishetty: రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానిగా నవీన్‌ పోలిశెట్టి పై థియేటర్‌ లో షూట్‌ !

రూ.2.4 కోట్ల క్రిప్టోకరెన్సీ మోసం: తమన్నా, కాజల్ అగర్వాల్‌లను పోలీసులు ప్రశ్నించాలి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments