Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు స్లో-పాయిజన్ ఇచ్చి శశికళ చంపేసింది: కేసు పెడతానన్న సుప్రీం లాయర్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5వ తేదీన అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధికి పక్కనే ఖననం చేశారు. జయలలిత మృతితో తమిళనాడు విషాదంలో మునిగిప

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (16:15 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5వ తేదీన అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధికి పక్కనే ఖననం చేశారు. జయలలిత మృతితో తమిళనాడు విషాదంలో మునిగిపోయింది. గత సెప్టెంబర్ 22వ తేదీ అపోలోలో చేరిన జయలలిత 75 రోజుల పాటు చికిత్స పొందుతూ.. చికిత్స ఫలించక మృతి చెందారు.

జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను ఎవ్వరూ పరామర్శించలేకపోయారు. ఫోటోలు విడుదల కాలేదు. ఆమె గొంతు కూడా వినలేకపోయారు. దీంతో అమ్మ మరణంలో అనుమానాలున్నాయని చాలామంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు లాయర్ కృష్ణమూర్తి జయలలిత మృతిపట్ల శశికళపై డౌట్ ఉన్నట్లు సంచలన ఆడియో రిలీజ్ చేశారు. 
 
అందులో జయలలిత ఆస్తులను అపహరించాలనే ఉద్దేశంతోనే.. శశికళ జయలలితను చంపేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. స్లో పాయిజన్ ఇచ్చిన విషయం తెలుసుకునే జయలలిత శశికళను ఇంటి నుంచి బయటకు నెట్టేశారని.. అందుకే శశికళపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు కృష్ణమూర్తి ఆవేశంగా ఆ ఆడియోలో మాట్లాడారు. 

ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో అన్నాడీఎంకే కార్యకర్తల మధ్య చర్చనీయాంశమైంది. మరి కృష్ణమూర్తి రిలీజ్ చేసిన ఆడియో నిజమైందేనా? శశికళపై ఆయన కేసు పెడతారా? లేదా? అనేది తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments