Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీవీఐపీల ప్రయాణం కోసం బోయింగ్777... మరికొన్ని గంటల్లో ల్యాండింగ్

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (15:04 IST)
దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి వంటి వీవీఐపీలు ప్రయాణించేందుకు వీలుగా బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారత్ కొనుగోలుచేసింది. దీనికి ఎయిరిండియా వన్ అనే పేరు పెట్టారు. దీన్ని అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసింది. ఈ అత్యాధునిక బీ777 విమానం మరికొన్ని గంటల్లో భారత గడ్డను ముద్దాడనుంది. 
 
నిజానికి ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా సంస్థకు బోయింగ్ కంపెనీ గత ఆగస్టులోనే అందించాల్సి ఉండగా... కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది ఆలస్యమైంది. కాసేపట్లో ఈ విమానం ఢిల్లీలో ల్యాండ్ కానుంది. మరో విమానం కొన్ని రోజుల తర్వాత అందనుంది.
 
మరోవైపు వీవీఐపీల ప్రయాణ సమయాల్లో ఈ రెండు విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లుకాకుండా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు నడుపనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడుపుతున్నారు. 
 
అంతేకాదు ఇతర సమయాల్లో వాటిని కమర్షియల్ ఆపరేషన్లకు కూడా వినియోగిస్తున్నారు. కానీ, ఎయిరిండియా విమానాలను మాత్రం కేవలం వీవీఐపీల కోసం మాత్రమే వినియోగించనున్నారు. అందుకే ఇకపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు మాత్రమే ఇకపై ఈ విమానం నడుపనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments