Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాంకాంగ్‌లో ఎయిరిండియా విమానాలపై వారం బ్రేక్

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (17:34 IST)
హాంకాంగ్‌లో ఎయిరిండియా విమానాలపై వారం రోజుల పాటు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఏప్రిల్ 24వరకూ విమాన సర్వీసులను వాయిదా వేశారు. ప్రయాణానికి 48 గంటల ముందు చేయించుకున్న పరీక్షా ఫలితాల్లోని కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్‌తో మాత్రమే అనుమతిస్తామని హాంకాంగ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాంతో పాటు హాంకాంగ్ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత మరోసారి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
ఏప్రిల్ 16న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించి వచ్చిన ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. దీంతో న్యూఢిల్లీ, కోల్‌కతా నుంచి వచ్చే ఎయిరిండియా విమానాలను ఏప్రిల్ 24వరకూ రద్దు చేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.  
 
మరోవైపు రెండు నెలలుగా చైనా తూర్పు ప్రాంతంలో కరోనా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే దేశ ఆర్ధిక రాజధాని షాంఘై సహా తూర్పు ప్రాంతంలోని 27 నగరాలలో కఠిన లాక్ డౌన్, 17 నగరాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించారు అధికారులు.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments