Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా శుభవార్త.. శ్రీనగర్ మార్గంలో చార్జీలను తగ్గింపు

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (15:25 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితుల దృష్ట్యా ఎయిరిండియా ఓ శుభవార్త చెప్పింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను రద్దు చేసిన విషయం తెల్సిందే. 
 
పైగా, పర్యటకులను, యాత్రికులను ఉన్నఫళంగా వెనక్కి తిరిగి రావాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎయిరిండియాలో ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో విమాన రేట్లు తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిథి ధనుంజయ కుమార్‌ ఆదివారం ప్రకటించారు.
 
శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి సాధారణ ఛార్జ్‌ రూ.9500 కాగా, ప్రస్తుత తగ్గింపుతో రూ.6715గా, అలాగే ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు రూ.6,899 కానుంది. ఈ తగ్గింపు ఆగస్టు 15 వరకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఎయిరిండియా అథారిటీ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 6,200 మంది ప్రయాణికులు శ్రీనగర్‌ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తమ వద్ద నమోదు చేసుకున్నట్లు తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విమాన సంస్థలు ప్రత్యేక సర్వీసులను కూడా నడుపుతున్నాయి. విమాన ఛార్జీల తగ్గింపుపై జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సంతోషం వ్యక్తంస్తూ, ఎయిరిండియాకు కృతజ్ఞతలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments